హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ) దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. సోమవారం విడుదలైన పైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్ -2025లో దేశంలోనే టాప్-1 స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో 27వ స్థానానికి ఎగబాకింది. అంతక్రితం ఏడాది 31వ స్థానంలో నిలిచి ఉన్నది.