Bank Holidays | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించడం సర్వ సాధారణం. అప్పుడప్పుడూ తమ ఖాతా ఉన్న బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి రావచ్చు. అయితే, ఆయా రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయా.. లేదా.. తెలుసుకుంటే ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ నెలలో దేశవ్యాప్తంగా 19 రోజులు బ్యాంకులకు సెలవులు. మొహరం, రక్షాబంధన్ తదితర వేడుకల కారణంగా ఈ వారంలో ఆరు రోజులు బ్యాంకులు పని చేయవు.
ఆగస్టు తొమ్మిదో తేదీ (మంగళవారం) మొహర్రం సందర్భంగా త్రిపుర, గుజరాత్, మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, హైదరాబాద్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, లక్నో, న్యూఢిల్లీ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సెలవులు. మొహర్రం వీక్లో ఈ నెల 11,12,13,14 తేదీల్లోనూ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ వారాంతంలో 11-12లలో రక్షాబంధన్, 13న రెండో శనివారం, 14న ఆదివారం, 15న దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవులు. కొన్ని పర్వదినాలకు సంబంధించి రాష్ట్రాల వారీగా, బ్యాంకుల వారీగా సెలవుల్లో తేడాలుండొచ్చు.