Legal Notice | లీగల్ నోటీసులు వాట్సాప్, మెయిల్ రూపంలో పంపొచ్చా.. అలా పంపితే చెల్లుబాటవుతుందా ?
Legal Notice | వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా లీగల్ నోటీసులు జారీ చేయవచ్చునని, పలు కోర్టులు దీన్ని ధ్రువీకరిస్తున్నాయని న్యాయ నిపుణులు తెలిపారు.
Legal Notice | మీకు వ్యతిరేకంగా ఏదైనా కోర్టు కేసు నమోదైనప్పుడు సాధారణంగా న్యాయస్థానం మీరు నివాసం ఉండే చిరునామా (అడ్రస్)కు పంపుతుంది. కానీ, ఇప్పుడు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అధికారికంగా గానీ, వ్యక్తిగతంగా గానీ ఏదైనా సమాచారం తెలియజేయాలనుకుంటే వాట్సాప్, ఈ-మెయిల్, ఇతర ఎలక్ట్రానిక్ మోడ్ల్లో సమాచారం ఇవ్వవచ్చు. అలాగే కోర్టు నోటీసు కూడా వాట్సాప్, ఈ-మెయిల్ తదితర ఎలక్ట్రానిక్ మోడ్ల్లో కోర్టు నోటీసు జారీ చేయొచ్చా? అన్న అనుమానాలు ఉన్నాయి.
ఎవరైనా వాట్సాప్, ఈ-మెయిల్ తదితర ఎలక్ట్రానిక్ మోడ్స్‌లో లీగల్ నోటీసు పంపడం గానీ, స్వీకరించడం గానీ చేయొచ్చునని చాంబర్స్ ఆఫ్ భారత్ చుగ్ అడ్వకేట్ మయాంక్ అరోరా చెప్పారు. మనీ రికవరీ నోటీసు, తొలగింపు నోటీసును వాట్సాప్, ఈ-మెయిల్ తదితర మార్గాల్లో పంపొచ్చునని తెలిపారు. సాధారణంగా న్యాయస్థానాలు జారీ చేసే నోటీసులను న్యాయవాది ద్వారా జారీ చేస్తారు. కోర్టుకు వెళ్లడానికి ముందు నోటీసుల జారీ ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారన్నారు. ఇప్పుడు పలు కోర్టులు వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా నోటీసులు పంపడాన్ని గుర్తిస్తున్నాయని మయాంక్ అరోరా తెలిపారు. ఖైతాన్ అండ్ కో పార్టనర్ ఆశీష్ మెహతా స్పందిస్తూ వ్యక్తులకు వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా పంపడం ఇప్పుడు చెల్లుబాటవుతుందని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

