IRDAI | పత్రాల్లేవని క్లెయిమ్ ఆపొద్దు.. ఐఆర్డీఏఐ మాస్టర్ సర్క్యులర్
IRDAI | కావాల్సిన పత్రాలు లేవంటూ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీదారుల క్లెయిమ్‌లను తిరస్కరించరాదని బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ మంగళవారం స్పష్టం చేసింది. అవసరమైన పత్రాలను క్లెయిమ్ ప్రతిపాదనను పూర్తి చేస్తున్న సమయంలోనే అడుగాలన్నది.
న్యూఢిల్లీ, జూన్ 11: కావాల్సిన పత్రాలు లేవంటూ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీదారుల క్లెయిమ్‌లను తిరస్కరించరాదని బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ మంగళవారం స్పష్టం చేసింది. అవసరమైన పత్రాలను క్లెయిమ్ ప్రతిపాదనను పూర్తి చేస్తున్న సమయంలోనే అడుగాలన్నది. అయితే క్యాష్‌లెస్ సదుపాయం అందుబాటులో లేకపోతే క్లెయిమ్ సెటిల్మెంట్కు సంబంధించిన లేదా అవసరమైన పత్రాలను ముందుగానే అడుగవచ్చన్నది.
ఈ మేరకు ఓ మాస్టర్ సర్క్యులర్‌ను విడుదల చేసింది. జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారంపై ఇచ్చిన ఈ సమగ్ర మాస్టర్ సర్క్యులర్‌తో గత 13 సర్క్యులర్లు రైద్దెపోయాయి. ఇక క్లెయిమ్‌లను బీమా కంపెనీలు వేగంగా పరిష్కరించాలని, సర్వేయర్ల నియామకం, వారి నివేదికల సమర్పణ చకచకా జరిగిపోవాలని కూడా ఐఆర్డీఏఐ ఆదేశించింది.
సమయానికి సర్వే రిపోర్టులను పొందడం బీమా సంస్థల బాధ్యతన్నది. పాలసీదారులకు వారు తీసుకున్న బీమాకు సంబంధించిన పూర్తి అవగాహన కోసం కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ ఇవ్వాలని, అందులో బీమా కవరేజీ, మినహాయింపులు, వారంటీలు, క్లెయిమ్ పరిష్కార ప్రక్రియ వంటివి వివరంగా ఉండాలని ఈ సందర్భంగా బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ సూచించింది.
మాస్టర్ సర్క్యులర్ ముఖ్యాంశాలు
- బీమా సంస్థకు తెలిపి రిటైల్ కస్టమర్లు ఎప్పుడైనా పాలసీని రద్దు చేసుకోవచ్చు.
- పాలసీదారుడు మోసం చేసినట్టు గుర్తిస్తేనే పాలసీని బీమా సంస్థ రద్దు చేయవచ్చు.
- పాలసీ వ్యవధి తీరకపోతే మిగిలిన కాలానికి సంబంధించిన ప్రీమియంను రద్దు చేసుకున్న పాలసీదారునికి బీమా సంస్థ తిరిగి చెల్లించాలి.
- మోటర్ ఇన్సూరెన్స్ కొనుగోలుదారులకు ‘పే యాజ్ యూ డ్రైవ్’ ఆప్షన్ ఇవ్వాలి.
- గృహ యజమానుల అగ్ని ప్రమాద పాలసీకి వరదలు, తుఫాన్, భూకంపం, కొండ చరియలు విరిగిపడటం, తీవ్రవాదం తదితర యాడ్ ఆన్ కవరేజీలను ఎంచుకునే వెసులుబాటు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

