iQoo Z7 Pro 5G |ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్7 ప్రో 5జీ (iQoo Z7 Pro 5G) ఫోన్ భారత్ మార్కెట్లో గురువారం ఆవిష్కరించింది. ఇంతకుముందు ఐక్యూ జడ్7 5జీ (iQoo Z7 5G), ఐక్యూ జడ్7ఎస్ 5జీ (iQoo Z7 S 5G) ఫోన్లను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఐక్యూ జడ్7 ప్రో 5జీ (iQoo Z7 Pro 5G) ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 920 ఎస్వోసీ చిప్ సెట్, 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వచ్చింది. రెండు వేర్వేరు స్టోరేజీ ఆప్షన్లు, వేర్వేరు కలర్ వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది.
ఐక్యూ జడ్7 ప్రో 5జీ (iQoo Z7 Pro 5G) ఫోన్ బ్లూ లగూన్, గ్రాఫైట్ మ్యాట్టే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.23,999, 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.24,999లకు లభిస్తుంది.
రెండు వేరియంట్లపై స్పెషల్ డిస్కౌంట్లతోపాటు సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులపై రూ.2000 వరకు రాయితీ అందిస్తోంది ఐక్యూ. సెప్టెంబర్ ఐదో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్‌తోపాటు ఐక్యూ వెబ్సైట్ ద్వారా ఈ ఫోన్ విక్రయిస్తారు.
6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2400×1080 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ప్లే విత్ 20:9 రేషియో, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది.
ఒక్టాకోర్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ చిప్సెట్..విత్ మాలీ-జీ610 ఎంసీ4 జీపీయూతో వస్తున్నది. 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తున్న ఐక్యూ జడ్7ప్రో 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 13 వర్షన్ మీద పని చేస్తుంది.
64-మెగా పిక్సెల్ శాంసంగ్ జీడబ్ల్యూ3 ప్రైమరీ రేర్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ విత్ రింగ్ లైక్ ఎల్ఈడీ లైట్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతో అందుబాటులోకి వస్తున్నది.
ఐక్యూ జడ్7 ప్రో ఫోన్ 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 66 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఇంకా యాక్సెలో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఈ-కంపాస్, గైరో స్కోప్ తదితర ఫీచర్లు ఉంటాయి. 5జీ, 4జీ వోల్ట్ వై-ఫై6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ-పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.