iPhone 16 | జూన్‌లో ఐఫోన్ 16 సిరీస్ ప్రొడక్షన్ షురూ..యాపిల్ లేటెస్ట్ డివైజ్‌ల ధరలకు రెక్కలు?
iPhone 16 : ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్ లాంఛ్ చేసే దిశగా కసరత్తును యాపిల్ వేగవంతం చేసింది.
iPhone 16 : ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్ లాంఛ్ చేసే దిశగా కసరత్తును యాపిల్ వేగవంతం చేసింది. జూన్ నుంచి ఐఫోన్ 16 ఫోన్ల తయారీని యాపిల్ ముమ్మరంగా చేపడుతుందని ప్రముఖ డిస్ప్లే అనలిస్ట్ రాస్ యంగ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఐఫోన్ 15 సిరీస్ ప్రొడక్షన్ గత ఏడాది ఆగస్ట్‌లో ప్రారంభం కాగా, ఐఫోన్ 16 మోడల్స్ తయారీ ఈసారి ముందుగానే చేపట్టడం గమనార్హం.
జులైలో ఐఫోన్ 16 సిరీస్ మాస్ ప్రొడక్షన్ పెద్ద ఎత్తున జరుగుతుందని భావిస్తున్నారు. ఇక యాపిల్ 2024 ఐఫోన్లను భారత్‌లో తయారుచేస్తుందా లేదా అనే వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15 భారత్‌లో తయారైనా భారత్ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ఆయా డివైజ్‌ల ధరలను యాపిల్ తగ్గించలేదు.
మరోవైపు యాపిల్ ఈసారి ఐఫోన్ 16, ప్లస్ మోడల్స్ ధరలను పెంచుతుందనే వార్తలు కస్టమర్లను కలవరపరుస్తున్నాయి. ముఖ్యంగా ప్రొ మోడల్స్ ధరలను గత ఏడాది యాపిల్ పెంచిన క్రమంలో ఐఫోన్ 16 విషయంలోనూ ఇదే ఒరవడి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఐఫోన్ 16 లాంఛ్ ఈవెంట్‌కు ముందు యాపిల్ లేటెస్ట్ డివైజ్‌ల ధరలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read More :
Yadadri | యాదాద్రిలో నృసింహ స్వామి జయంత్యోత్సవాలు ప్రారంభం..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

