iPhone 14 | ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. రూ.50 వేల లోపే ఐ-ఫోన్ 14! ఇవీ డిటైల్స్..!!
iPhone 14 | ఐ-ఫోన్ 14పై ఫ్లిప్ కార్ట్ బిగ్ దీపావళి సేల్స్ కింద బంపరాఫర్ అందిస్తోంది. రూ.74,499 ధర గల ఐ-ఫోన్ 14 రూ.49,999లకే సొంతం చేసుకోవచ్చు.
iPhone 14 | దేశవ్యాప్తంగా ఫెస్టివ్ సీజన్ కొనసాగుతున్నది. మరో 12 రోజుల్లో దీపావళి పండుగ రానున్నది. భారతీయులు పండుగల సీజన్లోనే తమకు ఇష్టమైన వస్తువు కొనుగోలు చేస్తారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు తమకు ఇష్టమైన ఫీచర్లు గల మొబైల్ ఫోన్ల కొనుగోలుకు మొగ్గు చూపుతుంటారు.. అందునా ఆపిల్ ఐ-ఫోన్ కొనుగోలు చేయాలనుకున్నా దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండదు. అటువంటి వారి కోసం ఆపిల్ ఐ-ఫోన్‌పై దీపావళి సందర్భంగా ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్‌తో ఆపిల్ ఐ-ఫోన్14 తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
గతేడాది ఆవిష్కరించినప్పుడు ఆపిల్ ఐ-ఫోన్14 ధర రూ.77,900గా ప్రకటించింది. ఇప్పుడు రూ.49,999లకే సొంతం చేసుకోవచ్చు. దీపావళి సేల్ ఆఫర్‌గా ఐ-ఫోన్ 14ను ఫ్లిప్‌కార్ట్ రూ.54,999లకే అందుబాటులోకి తెచ్చింది. దీనికి తోడు ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ.4000 డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మరో రూ.1000 రాయితీ కలుపుకుంటే రూ.49,999లకే ఐ-ఫోన్ 14 సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు యూజర్లు రూ.19,999 డౌన్ పేమెంట్, మిగతా రూ.35 వేలు.. నో-కాస్ట్ ఈఎంఐ కింద చెల్లించి ఐ-ఫోన్ 14 కొనుగోలు చేయవచ్చు.
2022 సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చిన ఐ-ఫోన్ 14 ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. డోల్బీ విజన్‌కు మద్దతుగా నిలిచే ఐ-ఫోన్ 14 ఫోన్ 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఆపిల్ ఏ15 బయోనిక్ ఎస్వోసీ చిప్‌సెట్‌పై ఐ-ఫోన్ 14 పని చేస్తుంది.
12-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతోపాటు మరో సెకండరీ 12-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాలతో ఐ-ఫోన్ 14 ఫోన్ లభిస్తుంది. రెండు కెమెరాలకూ బ్యాక్ సైడ్ నుంచి 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా ఉంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12-మెగా పిక్సెల్ ట్రూత్ డెప్త్ కెమెరా ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

