Flipkart : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్
యాపిల్ ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఈవెంట్లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇప్పటికే లైవ్‌లో ఉన్న సేల్ నవంబర్ 30 వరకూ కొనసాగుతుంది.
న్యూఢిల్లీ : యాపిల్ ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఈవెంట్లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇప్పటికే లైవ్‌లో ఉన్న సేల్ నవంబర్ 30 వరకూ కొనసాగుతుంది. ఐఫోన్ 13పై బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లకు అదనంగా ఆకర్షణీయ తగ్గింపు లభిస్తోంది. ఆరు రోజుల పాటు ఈకామర్స్ దిగ్గజం సేల్ ఈవెంట్‌ను నిర్వహిస్తుండగా పలు డివైజ్‌లపై డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 13, ఐఫోన్ 12, ఐఫోన్ 14 సహా పలు లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్ 13.. 128జీబీ మోడల్‌పై రూ. 3000 ఫ్లాట్ డిస్కౌంట్‌పై రూ. 62,999కి లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.1000 ఆఫర్ లభిస్తోంది. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 17,500 వరకూ లభిస్తుండటంతో ఐఫోన్ 13ను అందుబాటు ధరలో సొంతం చేసుకోవచ్చు. మరోవైపు అమెజాన్ వంటి ఇతర ఈకామర్స్ వేదికలపై ఐఫోన్ 13 రూ . 66,900 ప్రారంభ ధరకు లభిస్తోంది.
ఇక న్యూ ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌పై రూ .77,400 తగ్గింపు ధరకు ఆఫర్ చేస్తుండగా ఇది కొంత భారం కావడంతో ఐఫోన్ 14 డిజైన్, ఫీచర్లు ఐఫోన్ 13కు దగ్గరగా ఉండటంతో తక్కువ ధరలోనే ఐఫోన్ 13ను కొనుగోలు చేయడం మేలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. రూ.60,000 ఖర్చు చేయలేని వారు ఐఫోన్ 12 64జీబీని ఎంచుకోవాలని, ఇది ఫ్లిఫ్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో రూ. 48,999కి లభిస్తోంది. ఐఫోన్ 12 128జీబీ రూ .53,999కి అందుబాటులో ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

