Save Tax | ఐటీఆర్‌లో సెక్షన్‌తో కొడదాం.. పన్ను ఆదాకు 10 మార్గాలు!
ఇది ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల కాలం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (2024-25 మదింపు సంవత్సరం)గాను ఈ నెలాఖర్లోగా (జూలై 31) ఐటీఆర్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
Save Tax | ఇది ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల కాలం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (2024-25 మదింపు సంవత్సరం)గాను ఈ నెలాఖర్లోగా (జూలై 31) ఐటీఆర్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. దీంతో పన్ను ఆదా కోసం ఉన్న మార్గాలను అంతా వెతుకుతున్నారు. అయితే అందరికీ తెలిసింది సెక్షన్ 80సీ మాత్రమే. కానీ ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద రకరకాల పెట్టుబడులు, ఖర్చులు, రుణాల చెల్లింపులు, వడ్డీ ఆదాయాలపై పన్ను మినహాయింపును పొందవచ్చు.
వాటిని పరిశీలిస్తే..
నేషనల్ పెన్షన్ సిస్టమ్
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలదాకా పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇక సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద అదనంగా మరో రూ.50,000 ఆదా చేయవచ్చు. మొత్తంగా రూ.2 లక్షలు ఆదా అవుతాయి.
ఆరోగ్య బీమా
సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియంను క్లెయిం చేసుకోవచ్చు. ఎంత? అన్నది పాలసీ కవరేజీ, వయసుపై ఆధారపడి ఉంటుంది. ఇలా రూ.25,000, రూ.50,000, లక్ష రూపాయల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.
విద్యా రుణం
పిల్లల విద్య కోసం రుణం తీసుకున్నట్టయితే.. దాని చెల్లింపులపైనా పన్ను మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. సెక్షన్ 80ఈ కింద విద్యా రుణంలోని వడ్డీ భాగంపై పన్ను మినహాయింపును పరిమితి అనేదే లేకుండా పొందవచ్చు. రుణాన్ని చెల్లించేది తల్లిదండ్రులా.. పిల్లలా.. అన్న తేడా లేకుండా ఈ ప్రయోజనాన్ని అందుకోవచ్చు.
హోమ్ లోన్ వడ్డీ
గృహ రుణ చెల్లింపులపై రెండు మార్గాల్లో పన్ను మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు. ఒకటి సెక్షన్ 80సీ కింద అసలుపై రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. మరొకటి సెక్షన్ 24 కింద వడ్డీ భాగంపై రూ.2 లక్షలదాకా పన్ను ఆదా కోరవచ్చు. కొన్న ఇంట్లో మీరున్నా.. లేదా దానిపై అద్దె ఆదాయం పొందుతున్నా.. పన్ను మినహాయింపులను అందుకోవచ్చు.
తొలిసారి ఇంటి కొనుగోలుపై
తొలిసారి ఇంటిని కొనుగోలుచేసేవారికి సెక్షన్ 80ఈఈ కింద గృహ రుణ వడ్డీపై కేంద్ర ప్రభుత్వం అదనపు పన్ను ప్రయోజనాలను కల్పిస్తున్నది. ఈ సెక్షన్లో రూ.50,000 వరకు ఎక్స్ట్రా ట్యాక్స్ క్లెయిములు చేయవచ్చు. సెక్షన్ 24 కింద వర్తించే మినహాయింపులకు అదనం. దీంతో రూ.2.5 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. అయితే మీ పేరిట అంతకుముందు ఏ ఇల్లూ ఉండరాదు. అలాగే కొనే ఇంటి విలువ రూ.50 లక్షలు మించరాదు. తీసుకునే అప్పు కూడా రూ.35 లక్షలు దాటరాదు.
హెచ్ఆర్ఏ
ఉద్యోగులకు వారి సంస్థ యాజమాన్యాలు హౌజ్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ)ను ఇస్తే.. అద్దెపై పన్ను మినహాయింపును పొందవచ్చు. సెక్షన్ 80జీజీ కింద ఈ అవకాశం ఉంటుంది.
ఎస్బీ అకౌంట్ వడ్డీ
సేవింగ్స్ బ్యాంక్ (ఎస్బీ) అకౌంట్ నుంచి అందుకునే వడ్డీ ఆదాయంపైనా పన్ను మినహాయింపును కోరవచ్చు. వడ్డీ ఆదాయం రూ.10,000 వరకుంటే సెక్షన్ 80టీటీఏ కింద ఎవరైనా వ్యక్తి లేదా హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) ఐటీ ప్రయోజనాన్ని పొందవచ్చు.
దివ్యాంగుల కేర్ టేకర్‌గా..
మీరు దివ్యాంగుల బాగోగులు చూసుకుంటున్నైట్టెతే సెక్షన్ 80డీడీ కింద వారి ఖర్చులపై పన్ను మినహాయింపులను కోరవచ్చు. అంగ వైకల్యాన్నిబట్టి మినహాయింపు ఎంత? అన్నది తెలుస్తుంది. రూ.75,000-రూ.1.25 లక్షల మేర ఉంటుంది.
వైద్య ఖర్చులకు..
క్యాన్సర్, నరాల వ్యాధులు, ఎయిడ్స్ వంటి రోగాల వైద్య ఖర్చులపైనా ఐటీ మినహాయింపును తీసుకోవచ్చు. సెక్షన్ 80డీడీబీ కింద రూ.40,000 వరకు పన్ను తగ్గింపును పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకైతే లక్ష రూపాయలదాకా ప్రయోజనం ఉంటుంది.
విరాళాలు
విరాళాలపై సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపును క్లెయిం చేయవచ్చు. అయితే మొత్తం డొనేషన్‌పై ప్రయోజనం రాదు. అలాగే గుర్తింపు పొందిన ఛారిటబుల్ సంస్థకు విరాళం ఇస్తేనే ఈ సౌకర్యం ఉంటుంది.
పన్ను వర్తించే శ్లాబులో మీ ఆదాయం ఉన్నైట్టెతే.. ప్రతీ ఆర్థిక సంవత్సరం ఐటీఆర్‌ను తప్పక దాఖలు చేయాల్సిందే. అయితే ఆదాయ పన్ను పరిధిలో మనం లేము కదా.. అని చాలామంది ఐటీఆర్‌ను లైట్ తీసుకుంటారు. కానీ ఐటీ పరిధిలోకి రాకున్నా.. ఏటా నిల్ ఐటీఆర్‌ను దాఖలు చేస్తే పలు ప్రయోజనాలున్నాయి. 60 ఏండ్లలోపున్నవారికి పాత పన్ను విధానంలోనైతే రూ.2.5 లక్షలు, కొత్త పన్ను విధానంలోనైతే రూ.3 లక్షలదాకా వార్షిక ఆదా యం ఉన్నా పన్నులు చెల్లించనక్కర్లేదు. ఇక నిల్ ఐటీఆర్‌ను దాఖలు చేస్తే వీసా దరఖాస్తుల కోసం ప్రధాన ఆదాయ ధ్రువీకరణగా ఉంటుంది. అలాగే రుణాలను తీసుకునేటప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ట్యాక్స్ రిఫండ్స్కూ దోహదపడుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

