హైదరాబాద్, ఆగస్టు 21: దీర్ఘకాలికంగా ఆర్థిక ప్లానింగ్ వేసుకునేవారి జాబితాలో తెలంగాణ ముందువరుసలో నిలిచింది. ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ(ఐఏసీ-లైఫ్), ఐఎంఆర్బీ కాంతార సంయుక్తంగా నిర్వహించిన నివేదికలో పలు విషయాలను వెల్లడించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 94 శాతం మంది ఆర్థిక ప్రణాళికలు వేసుకోనుండగా, 87 శాతం మంది లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్ ప్లాన్లను తీసుకోవడానికి మొగ్గుచూపారు. హైదరాబాద్ ప్రాంతంలో ఆర్థిక పొదుపు, బీమా పాలసీలపై అధిక అనుభవం ఉన్నది.
రక్షణ, ప్రణాళిక, ముందస్తు పదవీ విరమణకు విలువనిచ్చే ఆర్థికంగా స్పృహకలిగిన తెలంగాణ ప్రతిబింబిస్తున్నది. జీవిత బీమాను కొనుగోలు చేయడానికి మాత్రమే కాకుండా, దీర్ఘకాలిక సంపద సృష్టికి ఉపయోగించడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు.
– వెంకటాచలం, ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ(ఐఏసీ-లైఫ్) కో-చైర్పర్సన్