Infosys Q1 | ఇన్ఫోసిస్ జూన్ త్రైమాసికంలో నికర లాభం రూ.6368 కోట్లు
Infosys Q1 | ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం నికర లాభాల్లో ఏడు శాతం వృద్ధి సాధించి రూ.6,368 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం గడించింది.
Infosys Q1 | ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం నికర లాభాల్లో ఏడు శాతం వృద్ధి సాధించి రూ.6,368 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం గడించింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సర గ్రోత్ గైడెన్స్ అంచనాలు పెంచేసింది. 2023-24 తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ.5,945 కోట్ల నికర లాభం గడించినట్లు బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. అయితే గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే మాత్రం కంపెనీ నికర లాభం 20 శాతం తగ్గింది. గతేడాది మార్చి త్రైమాసికంలో 7,969 కోట్ల నికర లాభం సంపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ 3-4 శాతం ఉంటుందని అంచనా వేసింది. 2024-25లో కంపెనీ గ్రోత్ గైడెన్స్ 1-3 శాతమే ఉంటుందని ఇన్ఫోసిస్ అంచనా వేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటును బట్టి 15 వేల నుంచి 20 వేల మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంటామని ఇన్ఫోసిస్ ఎండీ కం సీఈఓ సలీల్ పరేఖ్ చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో నిర్వహణ లాభాలు 21.1 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20-22 శాతం నిర్వహణ లాభాలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు సలీల్ పరేఖ్ చెప్పారు. తమ క్లయింట్ల క్లౌడ్ ఫౌండేషన్ డేటాసెట్స్ ఆధారంగా జనరేటివ్ ఏఐపై ఫోకస్ చేసినట్లు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

