Retail Inflation | మళ్లీ గాడి తప్పిన రిటైల్ ద్రవ్యోల్బణం.. ఆగస్టులో ఎంతంటే?!
Retail Inflation | ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ గాడి తప్పి ఏడు శాతానికి చేరుకుంది. ఇది ఆర్బీఐ సౌలభ్య స్థాయి కంటే ఎక్కువ.
Retail Inflation | రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ గాడి తప్పింది. జూలైలో 6.71 శాతంతో సగటు భారతీయుడికి కాసింత రిలీఫ్ ఇచ్చిన చిల్లర ద్రవ్యోల్బణం ఆగస్టులో తిరిగి కొండెక్కింది. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు శాతానికి చేరుకుంది. ఆహార వస్తువుల ధరలు పెరగడమే దీనికి కారణం అని సోమవారం ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. వినియోగదారుడి ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ సౌలభ్య స్థాయిని దాటేసి.. ఆరు శాతానికి పైగా నమోదు కావడం వరుసగా ఎనిమిదో నెల కావడం గమనార్హం.
ఆహార వస్తువుల ధరలు గత నెలలో 7.62 శాతం పెరిగాయి. జూలైలో 6.69 శాతం కాగా, గతేడాది ఆగస్టులో 3.11 శాతానికి చేరింది. హీట్ వేవ్ పెరిగిపోవడంతో గోధుమలు, బియ్యం, పన్ను ధాన్యాల ధరలు ఎక్కువై భారతీయుల గృహ బడ్జెట్‌పై భారం పెరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణంలో 50 శాతం ఆహార ధాన్యాల, వస్తువుల ధరలు కీలకం అవుతాయి.
మరోవైపు భారత్ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీ జూలైలో 2.4 శాతం పెరిగింది. 2021 జూలైలో ఇది 11.5 శాతం. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) రిలీజ్ చేసిన డేటా ప్రకారం జూలైలో ఐఐపీ వృద్ధిరేటు 3.2 శాతానికి చేరింది. మైనింగ్ ఉత్పత్తి 3.3 శాతం పడిపోగా, విద్యుత్ ఉత్పత్తి 2.3 శాతం పెరిగింది. కరోనాను నియంత్రించడానికి దేశవ్యాప్త లాక్డౌన్ విధించడంతో 2020 ఏప్రిల్‌లో ఐఐపీ 57.3 శాతం పడిపోయింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

