Forex Reserves | మున్ముందు విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్ forex reserves ) నిల్వలు మరింత అడుగంటే సంకేతాలు కనిపిస్తున్నాయి. మన జాతీయ కరెన్సీకి మద్దతుగా ఆర్బీఐ జోక్యం చేసుకున్నా కరంట్ ఖాతా లోటు (సీఏడీ) మరింత పైపైకి దూసుకెళ్లుందని డచెస్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు సుమారు 300 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం కరంట్ ఖాతా లోటు 140 బిలియన్ డాలర్లు (జీడీపీలో 3.9 శాతం) ఉంటుందని పేర్కొంది.
ఒకవేళ కరంట్ ఖాతా లోటు 140 బిలియన్ డాలర్లు పెరిగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెల్లింపుల సమతుల్యత (BOP – balance of payment) లోటు 80 బిలియన్ డాలర్లు ఉండొచ్చు. అదనపు క్యాపిటల్ ఖాతా 60 బిలియన్ డాలర్లు ఉండవచ్చు` అని డచెస్ బ్యాంక్ ఇండియా, సౌత్ ఆసియా చీఫ్ ఎకనమిస్ట్ కౌశిక్ దాస్ తెలిపారు.
డాలర్‌పై రూపాయి విలువ మార్పుల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 100 నుంచి 105 బిలియన్ డాలర్లకు చేరొచ్చు. స్పాట్ ఫారెక్స్ నిల్వలు మార్చి నెలాఖరులో 607 బిలియన్ డాలర్లు కాగా, గత నెలాఖరు నాటికి 561 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది చివరి నాటికి 550 బిలియన్ డాలర్ల దిగువకు చేరొచ్చునని పేర్కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం పెరిగితే అనిశ్చితిని తగ్గించి, భారీగా రూపాయి మారకం విలువ తగ్గకుండా చూడొచ్చునని డచెస్ బ్యాంక్ పేర్కొంది. దీంతో ఫారెక్స్ రిజర్వు నిల్వలు కూడా పడిపోవని తెలిపింది.