పసిడికి సుంకాల సెగ.. దేశంలోకి పెరిగిన స్మగ్లింగ్
దేశీయంగా గోల్డ్ డిమాండ్ ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో ఏకంగా 29 శాతం క్షీణించింది. దిగుమతి సుంకాల భారం, పెరిగిన ధరలు, బంగారం కొనవద్దంటూ దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో 162.5 టన్నులకే పరిమితమైంది.
- జూలై-సెప్టెంబర్‌లో 29% డిమాండ్ డౌన్
- డబ్ల్యూజీసీ తాజా నివేదిక
ముంబై, నవంబర్ 3 : దేశీయంగా గోల్డ్ డిమాండ్ ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో ఏకంగా 29 శాతం క్షీణించింది. దిగుమతి సుంకాల భారం, పెరిగిన ధరలు, బంగారం కొనవద్దంటూ దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో 162.5 టన్నులకే పరిమితమైంది. ఈ క్రమంలో ఈ ఏడాది మొత్తంగా పసిడి కొనుగోళ్లు 6 ఏండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 625-675 టన్నులుగానే ఉండొచ్చని మంగళవారం విడుదల చేసిన ‘క్యూ3 2026 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ నివేదికలో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది.
నిజానికి గత ఏడాది జూలై-సెప్టెంబర్‌లో బంగారం అమ్మకాలు 229.8 టన్నులుగా ఉన్నాయని గుర్తుచేసింది. కాగా, పెంచిన దిగుమతి సుంకాలతో దేశంలోకి గోల్డ్ స్మగ్లింగ్ భారీగా జరుగుతున్నదని ఈ సందర్భంగా డబ్ల్యూజీసీ చెప్పడం గమనార్హం. అలాగే పుత్తడి ధరలు పెరిగిన నేపథ్యంలో గోల్డ్ సేల్స్ తగ్గినా విలువపరంగా మాత్రం 3 శాతం పెరిగి రూ.2,41,900 కోట్లుగా ఉన్నది. నిరుడు దాదాపు 230 కోట్ల విక్రయాలు జరిగినా.. దాని వాల్యూ రూ.2,35,090 కోట్లుగానే ఉన్నది.
- దేశీయంగా ఈ జూలై-సెప్టెంబర్‌లో 10 గ్రాముల బంగారం రేటు (జీఎస్టీ, దిగుమతి సుంకం లేకుండా) సగటున రూ.1,48,891 (ట్రాయ్ ఔన్స్ 4,262 డాలర్లు) పలికింది. గత ఏడాది ఇదే వ్యవధిలో రూ.1,02,287 (3,457 డాలర్లు)గానే ఉన్నది.
- ఆభరణాలకు డిమాండ్ 20 శాతం పతనమై 99.9 టన్నులుగా ఉన్నది. నిరుడు 125 టన్నులు.
- బంగారం కడ్డీలు, నాణేలకు ఆదరణ మునుపటితో చూస్తే 40 శాతం తగ్గింది. నిరుడు జూలై-సెప్టెంబర్‌లో 91.6 టన్నులుగా ఉంటే.. ఈ ఏడాది కేవలం 55 టన్నులుగానే ఉన్నది.
- గోల్డ్ ఈటీఎఫ్‌ల మొత్తం డిమాండ్ కూడా 50 శాతం క్షీణించింది. 10.7 టన్నుల నుంచి 5.3 టన్నులకు దిగజారింది.
- దేశీయంగా ఈ 3 నెలల్లో రీసైకిల్డ్ గోల్డ్ 19.2 టన్నులుగా నమోదైంది. నిరుడు 21.8 టన్నులు.
- నికరంగా పుత్తడి దిగుమతులు ఈ జూలై-సెప్టెంబర్‌లో గతంతో పోల్చితే 46 శాతం తగ్గి 114.1 టన్నులుగా ఉన్నాయి. క్రిందటిసారి 211.9 టన్నులుగా ఉన్నది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ..
అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ జూలై-సెప్టెంబర్ గోల్డ్ డిమాండ్ 1 శాతం తగ్గి 1,369 టన్నుల వద్ద స్థిరపడింది. అధిక, నిలకడలేని ధరలే కారణమని డబ్ల్యూజీసీ పేర్కొన్నది. నగల డిమాండ్ 17 శాతం దిగి అత్యంత కనిష్ఠంగా 313 టన్నులుగా ఉన్నది. కరోనా సమయంలోనూ 331 టన్నులకు డిమాండ్ కనిపించినట్టు తెలిపింది. చైనాలో 22 శాతం తగ్గగా, భారత్‌లో 19.5 శాతం పడిపోయినట్టు వివరించింది. అమెరికా, మిడిల్ ఈస్ట్, సౌదీ అరేబియా తదితర దేశాల్లోనూ డిమాండ్ తగ్గుముఖం పట్టడం వరల్డ్ గోల్డ్ మార్కెట్‌ను ప్రభావితం చేసినట్టు డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈవో సచిన్ జైన్ పీటీఐకి తెలిపారు.
తగ్గిన బంగారం, వెండి ధరలు
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు మంగళవారం తగ్గాయి. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి రేటు రూ.700 క్షీణించి రూ.1,41,800 వద్ద నిలిచింది. అలాగే కిలో వెండి విలువ రూ.2,000 పతనమై రూ.1,84,000గా ఉన్నది. ఇదిలావుంటే హైదరాబాద్‌లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం పసిడి ధర రూ.1,28,000 పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే.. ఔన్స్ గోల్డ్ రేటు 41.19 డాలర్లు దిగి 3,905.44 డాలర్లుగా ఉన్నది. సిల్వర్ 48.97 డాలర్లుగా ట్రేడైంది. కాగా, రాబోయే ధనత్రయోదశి, దీపావళి సందర్భంగా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి కొనుగోళ్లు ఊపందుకోవచ్చన్న ఆశాభావాన్ని జ్యుయెల్లర్స్ వ్యక్తం చేస్తున్నారు.
దేశీయ గోల్డ్ మార్కెట్‌ను ఈ జూలై-సెప్టెంబర్ నిరాశపర్చినా.. చివర్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో అప్పటిదాకా తమ కొనుగోళ్లను వాయిదావేసిన చాలామంది తిరిగి ముందుకొచ్చారు. అలాగే దక్షిణ భారతంలో పెండ్లిళ్లు, పండుగల సీజన్ సేల్స్‌కు కలిసొచ్చింది. నగల వర్తకుల ఎక్సేంజీ ఆఫర్లూ కొనుగోలుదారుల్లో కొంత ఉత్సాహాన్నైతే నింపాయి. మొత్తానికి ఈ త్రైమాసికంలో అధికారికంగానైతే బులియన్ దిగుమతులు బాగా పడిపోయాయి. కానీ స్మగ్లింగ్ పెరిగిందన్న సంకేతాలైతే ఉన్నాయి. ఇక రీసైక్లింగ్ సైతం అంతంతమాత్రంగానే జరిగింది. అయితే ప్రస్తుత పండుగ సీజన్లో గోల్డ్ మార్కెట్ మళ్లీ కళకళలాడే అవకాశాలున్నాయి. తగ్గుతున్న ధరలు సైతం డిమాండ్‌ను పెంచవచ్చు. తేలికపాటి నగలకు ఆదరణ, ఎక్సేంజీ ఆఫర్ల హవా కనిపించవచ్చు.
-సచిన్ జైన్, డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈవో
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

