Forex Reserves | 6.55 బిలియన్ డాలర్లు పెరిగిన ఫారెక్స్ నిల్వలు.. ఇవీ కారణాలు..!
ఈ నెల ఒకటో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 6.55 బిలియన్ డాలర్లు పెరిగి 625.63 బిలియన్ల డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు మరింత పెరిగాయి. ఈ నెల ఒకటో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 6.55 బిలియన్ డాలర్లు పెరిగి 625.63 బిలియన్ల డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 23తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.98 బిలియన్ డాలర్లు పుంజుకుని 619.07 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఈ నెల ఒకటో తేదీతో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) 6.04 బిలియన్ డాలర్లు పెరిగి 554.23 బిలియన్ డాలర్లకు చేరాయి. డాలర్ ఇండెక్స్ లో అమెరికా డాలర్ యేతర కరెన్సీల విలువ పెరుగుదల, తగ్గుదల ఆధారంగా డాలర్ ఇండెక్స్ ఖరారవుతుంది. గోల్డ్ రిజర్వు నిల్వలు 569 మిలియన్ డాలర్లు పెరిగి 48.42 బిలియన్ డాలర్లకు చేరుకోగా, 17 మిలియన్ డాలర్ల పతనంతో ఎస్‌డీఆర్‌లు 18.18 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అలాగే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో ఫారెక్స్ నిల్వలు 41 మిలియన్ డాలర్లు తగ్గి 4.8 బిలియన్ డాలర్లకు పతనమయ్యాయి.
2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు ఆల్ టైం గరిష్ట స్థాయి 645 బిలియన్ డాలర్లకు పెరిగింది. తర్వాతీ కాలంలో అంతర్జాతీయంగా భౌగోళిక ఒత్తిళ్లతో ఆర్బీఐలో ఫారెక్స్ నిల్వలు పడిపోయాయి. రూపాయి విలువ పడిపోకుండా నివారించేందుకు ఆర్బీఐ బహిరంగ మార్కెట్లో డాలర్లను విక్రయిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

