2 బిలియన్ డాలర్లు తరిగిపోయిన ఫారెక్స్
రికార్డు స్థాయికి చేరుకున్న విదేశీ మారకం నిల్వలు తరిగిపోయాయి. గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన ఫారెక్స్ రిజర్వులు ఈ నెల 24తో ముగిసిన వారాంతానికిగాను 2.027 బిలియన్ డాలర్లు కరిగిపోయి 646.673 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ముంబై, మే 31: రికార్డు స్థాయికి చేరుకున్న విదేశీ మారకం నిల్వలు తరిగిపోయాయి. గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన ఫారెక్స్ రిజర్వులు ఈ నెల 24తో ముగిసిన వారాంతానికిగాను 2.027 బిలియన్ డాలర్లు కరిగిపోయి 646.673 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం వారంలో 4.549 బిలియన్ డాలర్లు పెరిగి రికార్డు స్థాయి 648.7 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే.
విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ పడిపోవడం వల్లనే రిజర్వులు తరిగాయని పేర్కొంది. గతవారంలో వీటి విలువ 1.51 బిలియన్ డాలర్లు తగ్గి 567.499 బిలియన్ డాలర్లకు తరిగాయి. యూరో, పౌండ్, యెన్ కరెన్సీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావడంతో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువలపై పడింది. అలాగే పసిడి రిజర్వులు 482 మిలియన్ డాలర్లు తగ్గి 56.713 బిలియన్ డాలర్లకు పడిపోగా, ప్రత్యేక డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్ఎస్) కింద రిజర్వులు 33 మిలియన్ డాలర్లు తగ్గి 18.135 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

