పడిపోయిన విదేశీ నిల్వలు
వరుసగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు భారీగా పడిపోయాయి. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ అంతకంతకు పడిపోవడంతో గతవారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.79 బిలియన్ డాలర్లు తరిగిపోయాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
- 2.79 బిలియన్ డాలర్లు డౌన్
ముంబై, జనవరి 26: వరుసగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు భారీగా పడిపోయాయి. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ అంతకంతకు పడిపోవడంతో గతవారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.79 బిలియన్ డాలర్లు తరిగిపోయాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఆర్బీఐ వద్ద విదేశీ నిల్వలు 616.14 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. వీటిలో విదేశీ కరెన్సీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావడంతో ఈ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 2.6 బిలియన్ డాలర్లు తగ్గి 545.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపింది. యూరో, పౌండ్, యెన్ కరెన్సీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావడం దేశీయ మారకం నిల్వలపై ప్రతికూల ప్రభావం చూపాయని పేర్కొంది. అలాగే పసిడి రిజర్వులు కూడా 34 బిలియన్ డాలర్లు తగ్గి 47.2 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు వెల్లడించింది. అలాగే ఎస్డీఆర్ఎస్ 476 మిలియన్ డాలర్లు తగ్గి 18.2 బిలియన్ డాలర్లకు, అలాగే ఐఎంఎఫ్ వద్ద ఉన్న నిల్వలు కూడా 18 మిలియన్ డాలర్లు తగ్గి 4.85 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని పేర్కొంది. ఈ నెల 12తో ముగిసిన వారంలో రిజర్వులు 1.6 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. విదేశీ ఎక్సేంజ్ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలపై రిజర్వు బ్యాంక్ అనుక్షణం అప్రమత్తంగా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

