డాటాను తెగవాడేస్తున్నారు!
దేశవ్యాప్తంగా డాటా వినిమయం వాయువేగంతో దూసుకుపోతున్నది. సరాసరిగా నెలకు సగటు భారతీయుడు 31 జీబీల డాటాను వినియోగిస్తున్నారు.
- 2025లో నెలకు దేశీయ సరాసరి డాటా వినిమయం 31 జీబీలు
న్యూఢిల్లీ, మార్చి 31: దేశవ్యాప్తంగా డాటా వినిమయం వాయువేగంతో దూసుకుపోతున్నది. సరాసరిగా నెలకు సగటు భారతీయుడు 31 జీబీల డాటాను వినియోగిస్తున్నారు. 2024లో 27.5 జీబీల డాటాను వినియోగిస్తుండగా..ఆ తర్వాత ఏడాది 2025లో ఇది 10 శాతం ఎగబాకి 31జీబీలకు చేరుకున్నదని టెలికాం పరికరాల తయారీ దిగ్గజం నోకియా తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
13వ ఎడిషన్‌గా నోకియా వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్‌ను మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నెలవారీ 5జీ డాటా ట్రాఫిక్ 70 శాతం ఎగబాకి 12.9 ఎక్సాబైట్స్కి చేరుకున్నట్టు తెలిపింది. మొత్తం మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లలో 47 శాతం 5జీ యూజర్లే ఉన్నారు.
2025లో సరాసరి నెలవారీ మొబైల్ డాటా వినిమయం 31జీబీలకు చేరుకున్నదని, గడిచిన ఐదేండ్లలో సరాసరిగా 18 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు వేగవంతంగా విస్తరిస్తుండటం, ఏఐ అప్లికేషన్లు, 4కే వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్‌లకు ఉన్న డిమాండ్ వల్లనే డాటా వినిమయం ఊపందుకున్నదని పేర్కొంది.
- 5జీ సబ్‌స్ర్కైబర్లలో ప్రపంచంలో రెండో స్థానంలో భారత్ నిలువగా, అలాగే 5జీ డాటా వినిమయంలోనూ, 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ కలిగివున్నవారిలో కూడా సెకండ్ ప్లేస్‌లో ఉన్నది.
- మెట్రో నగరాల్లో 5జీ అందుబాటులోకి రావడంతో ఇక్కడ వినియోగిదారులు భారీగా పెరిగారు. మొత్తం మొబైల్ వినిమయంలో ఈ వాటా 58 శాతానికి పైగా ఉన్నది.
- 2025 చివరినాటికి దేశవ్యాప్తంగా 89 కోట్ల 4జీ డివైజ్‌లు ఉండగా, 38.3 కోట్ల 5జీ డివైజ్‌లు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

