మురిపించని మూరత్
దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది మొదటి రోజునే నిరాశపర్చాయి. వరుస వారం రోజుల ర్యాలీని కొనసాగించలేకపోయాయి. ఆదివారం వచ్చిన నూతన సంవత్సరానికి (సంవత్ 2083) నష్టాలతో స్వాగతం పలికాయి. ఏటా దీపావళి రోజున భారతీయ స్టాక్ మార్కెట్లకు కొత్త ఏడాది ప్రారంభమవుతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సండే మూరత్ ట్రేడింగ్ నిర్వహించారు. 70 నిమిషాలపాటు సాగిన ఈ ప్రత్యేక ట్రేడింగ్‌లో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి.
- నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
- 2017 తర్వాత ఇదే తొలిసారి
ముంబై, నవంబర్ 9: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది మొదటి రోజునే నిరాశపర్చాయి. వరుస వారం రోజుల ర్యాలీని కొనసాగించలేకపోయాయి. ఆదివారం వచ్చిన నూతన సంవత్సరానికి (సంవత్ 2083) నష్టాలతో స్వాగతం పలికాయి. ఏటా దీపావళి రోజున భారతీయ స్టాక్ మార్కెట్లకు కొత్త ఏడాది ప్రారంభమవుతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సండే మూరత్ ట్రేడింగ్ నిర్వహించారు. 70 నిమిషాలపాటు సాగిన ఈ ప్రత్యేక ట్రేడింగ్‌లో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరికి బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 28.62 పాయింట్లు లేదా 0.04 శాతం పడిపోయి 81 వేల మార్కుకు దిగువన 80,999.40 వద్ద స్థిరపడింది.
అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 43.95 పాయింట్లు లేదా 0.18 శాతం కోల్పోయి 25 వేల మార్కుకు క్రింద 24,986.40 దగ్గర నిలిచింది. మధ్యాహ్నం 2:20 నుంచి 3:30 మధ్య ఈ స్వల్పకాలిక ట్రేడింగ్ జరుగగా.. ఆరంభంలోనే సెన్సెక్స్ 250, నిఫ్టీ 40 పాయింట్ల మేర ఎగిశాయి. అయితే అంతలోనే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో సూచీలు నష్టాల్లో ముగియక తప్పలేదు. 2017 తర్వాత దీపావళి పండుగ పూట స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగియడం ఇదే తొలిసారి. 2018 నుంచి ఏటా మూరత్ ట్రేడింగ్‌లో సూచీలు లాభాల్లోనే ముగుస్తున్నాయి. కానీ ఈ సంప్రదాయానికి ఈసారి బ్రేక్ పడింది. కాగా, శుక్రవారం సంవత్ 2082కు స్టాక్ మార్కెట్లు లాభాలతో వీడ్కోలు పలికిన సంగతి విదితమే.
లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు
సోమవారం సూచీలు లాభాల్లో ముగిశాయి. దిగుతున్న ముడి చమురు ధరలు, కృత్రిమ మేధస్సు (ఏఐ)పై ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తగ్గుతాయన్న ఆశలు, బ్యాంకింగ్-ఆర్థిక షేర్లలో కొనుగోలు ఉత్సాహం వంటివి కలిసొచ్చాయి. దీంతో సెన్సెక్స్ 107.25 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 81,106.65 వద్ద ఆగింది. ఒకానొక దశలో 340.01 పాయింట్లు ఎగబాకింది. ఇక నిఫ్టీ 58.25 పాయింట్లు లేదా 0.23 శాతం అందుకొని 25,044.65 వద్ద ముగిసింది.
సెన్సెక్స్‌లో ఎస్బీఐ, ట్రెంట్, ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు మదుపర్లను ఆకట్టుకున్నాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 0.34 శాతం, స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 0.07 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూసినైట్టెతే.. సర్కారీ బ్యాంకులు 3.76 శాతం, హెల్త్‌కేర్ 1.10 శాతం, ప్రైవేట్ రంగ బ్యాంకులు 0.85 శాతం, ఆర్థిక సేవలు 0.73 శాతం, విద్యుత్తు 0.57 శాతం చొప్పున పెరిగాయి. ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా సూచీలు లాభాల్లో ముగియగా.. దక్షిణ కొరియా, హాంకాంగ్ సూచీలు నష్టాలకు పరిమితమయ్యాయి.
నేడు మార్కెట్లకు సెలవు
మంగళవారం స్టాక్ మార్కెట్లు సెలవు పాటించనున్నాయి. దీపావళి-బలిప్రతిపద సందర్భంగా మూతపడనున్నాయి. బుధవారం తిరిగి యథాతథంగా ట్రేడింగ్ జరుగుతుందని అటు బీఎస్ఈ, ఇటు ఎన్ఎస్ఈ వర్గాలు సోమవారం అధికారికంగా ప్రకటించాయి.
రూపీ 21 పైసలు జంప్
చమురు ధరలు తగ్గడం, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ నిధుల ప్రవావం పుంజుకోవడం, పశ్చిమాసియాలో శాంతి నెలకొనే అవకాశాలుండటంతో దేశీయ కరెన్సీ విలువ రివ్వున ఎగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 21 పైసలు ఎగబాకి 93.77కి చేరుకున్నది. ఉదయం 93.85 వద్ద ప్రారంభమైన రూపీ.. ఒక దశలో 93.68 గరిష్ఠ స్థాయికి చేరింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

