Ola Electric | ఓలా ఎలక్ట్రిక్‌కు షాక్.. సేవల తీరుపై విచారణకు సీసీపీఏ ఆదేశం..!
Ola Electric | ఈవీ స్కూటర్లకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సర్వీసు ప్రమాణాలు, స్కూటర్లలో తలెత్తే సమస్యల పరిష్కారంలో లోపాలపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) విస్తృత విచారణకు ఆదేశించింది.
Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)కు గట్టి షాక్ తగిలింది. ఈవీ స్కూటర్లకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సర్వీసు ప్రమాణాలు, స్కూటర్లలో తలెత్తే సమస్యల పరిష్కారంలో లోపాలపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) విస్తృత విచారణకు ఆదేశించింది. కస్టమర్ల హక్కులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో సీసీపీఏ విచారణకు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) సర్వీసు, చార్జింగ్, వారంటీ, సేవల్లో అసంతృప్తి తదితర అంశాలపై సీపీఏకు పది వేల ఫిర్యాదులు రావడం గమనార్హం. ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని ఓలా ఎలక్ట్రిక్ యాజమాన్యానికి గత నెల ఏడో తేదీన సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. కానీ తమకు వచ్చిన ఫిర్యాదులపై 99.1 శాతం పరిష్కరించామని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొన్నది.
ఓలా ఎలక్ట్రిక్ ప్రతిస్పందనను సమీక్షించిన తర్వాత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)ను సవివరంగా విచారించాలని సీసీపీఏ కోరిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శి నిధి ఖరే చెప్పారు. దీనిపై స్పందించడానికి ఓలా ఎలక్ట్రిక్ ముందుకు రాలేదు. 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ను సీసీపీఏ కోరింది. చార్జింగ్, ఫ్రీ సర్వీస్, వారంటీ, సేవల్లో అసంతృప్తి, వారంటీ తిరస్కృతి, సర్వీసింగ్ తర్వాత లోపాలు, ప్రచారంతో పోలిస్తే పనితీరులో లోపం తదితర సమస్యలు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bis
- Business news
- CCPA
- ola electric
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

