Foreign Reserves | రికార్డు స్థాయికి భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు..!
Foreign Reserves | భారతదేశ విదేశీ మారకద్రవ్య నిలువలు ఈ వారం రికార్డు స్థాయిలో 622.469 బిలియన్లకు పెరిగాయి. ఫిబ్రవరి 2తో ముగిసిన వారంతో పోలిస్తే ఇది 5.736 బిలియన్ డాలర్లు పెరిగింది.
Foreign Reserves | భారతదేశ విదేశీ మారకద్రవ్య నిలువలు ఈ వారం రికార్డు స్థాయిలో 622.469 బిలియన్లకు పెరిగాయి. ఫిబ్రవరి 2తో ముగిసిన వారంతో పోలిస్తే ఇది 5.736 బిలియన్ డాలర్లు పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ వీక్లీ డేటా ప్రకారం.. భారతదేశ విదేశీ మారక నిల్వలలో అతిపెద్ద వాటా విదేశీ కరెన్సీ ఆస్తులు కాగా.. ఇది 5.186 బిలియన్ డాలర్లు పెరిగి 551.331 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలాగే పసిడి నిల్వలు సైతం 680 మిలియన్ డాలర్లు పెరిగి 48బిలియన్ డాలర్లకు చేరాయి. 2021 అక్టోబర్‌లో భారత విదేశీ మారక నిల్వలు గరిష్ఠ స్థాయి 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
అయితే దిగుమతుల వ్యయం పెరగడంతో 2022లో విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గాయి. ఇప్పుడు మరోసారి గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం తర్వాత, విదేశీ కరెన్సీ ఆస్తుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశంలో తగినన్ని ఫారెక్స్ రిజర్వులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. ఏ దేశంలోనైనా విదేశీ మారక నిల్వలు ఎంత భారీగా ఉంటే.. ఆ దేశం ఆర్థికంగా అంత బలంగా ఉండనున్నది. దేశ ఆర్థిక స్థిరత్వంలో ఫారెక్స్ రిజర్వ్ కీలక పాత్ర. విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నాయంటే.. ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిగా దాన్ని గుర్తించాలని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

