మాస్టర్‌కార్డ్‌కు ఆర్బీఐ షాక్

కొత్త కస్టమర్లకు కార్డులు ఇవ్వద్దంటూ నిషేధం
ముంబై, జూలై 14: మాస్టర్‌కార్డ్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. డాటా స్టోరేజీ నిబంధనల అమలులో వైఫల్యం చెందిందంటూ కొత్తగా కస్టమర్లకు కార్డులు జారీ చేయరాదని వేటు వేసింది. ఈ నెల 22 నుంచి క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డ్ కస్టమర్లకు భారత్‌లో సేవలందించకుండా మాస్టర్‌కార్డ్ ఆసియా పసిఫిక్‌పై నిషేధం విధిస్తున్నట్లు ఆర్బీఐ బుధవారం స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయం ప్రభావం.. ఇప్పటికే ఉన్న మాస్టర్‌కార్డ్ వినియోగదారులపై ఎంతమాత్రం ఉండబోదన్నది. పాత కస్టమర్లకు ఎప్పట్లాగే మాస్టర్‌కార్డ్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ చెప్పింది. కాగా, నిబంధనలను పాటించాలని ఎన్నిసార్లు చెప్పినా, అవకాశాలు ఇచ్చినా.. మాస్టర్‌కార్డ్ పట్టించుకోలేదని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆర్బీఐ వివరించింది. ఈ క్రమంలో నిషేధం సమాచారాన్ని బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ సంస్థలకు మాస్టర్‌కార్డ్ తెలియపర్చాలని కూడా ఆదేశించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- India
- master card
- rbi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

