Personal Loan | బెటర్ సిబిల్ స్కోర్ ఉంటే.. పర్సనల్ లోన్ ఈజీ.. అయితే!
Personal Loan | మెరుగైన సిబిల్ స్కోర్ ఉంటే పలు బ్యాంకులు ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్లు ఇస్తున్నాయి.
Personal Loan | ఎంత ఆస్తి ఉన్నా.. సంపన్నులైనా జీవితంలో ఎప్పుడో ఒకసారి అప్పు చేయక తప్పనిసరి పరిస్థితులు ఉంటాయి. అయితే, ప్రస్తుతం రుణం కోసం దరఖాస్తు చేస్తున్న వారి క్రెడిట్ స్కోర్‌ను బట్టే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) వ్యక్తిగత రుణాలిస్తాయి. అన్సెక్యూర్డ్ లోన్ అయినా, ప్రతి ఒక్కరి క్రెడిట్ స్కోర్ ఆధారంగా పర్సనల్ లోన్ లభ్యత ఆధార పడి ఉంటుంది. సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటే తక్కువ వడ్డీకే సకాలంలో పర్సనల్ లోన్ మంజూరు చేస్తాయి బ్యాంకులు.. ఆర్థిక సంస్థలు.
క్లీన్ ఫైనాన్సియల్ హిస్టరీ, ఉదాహరణకు మీ క్రెడిట్ స్కోర్ 700 పాయింట్లకంటే ఎక్కువగా ఉంటే పలు బ్యాంకులు ప్రీ-అప్రూవ్డ్ లోన్లు మంజూరు చేస్తాయి. కొన్ని ప్రైవేట్ సంస్థలు.. రుణ గ్రహీతలకు తమ సంస్థల్లో ఖాతా లేకున్నా.. వారి సిబిల్ స్కోర్ ఆధారంగా ప్రీ-అప్రూవ్డ్ లోన్ మంజూరు చేయడానికి ముందుకు వస్తున్నాయి.. అందుకు ఆసక్తి చూపుతున్నాయి.
ఆస్తుల ష్యూరిటీ లేకుండానే పర్సనల్ లోన్లు వస్తాయి. కనీస పత్రాల డాక్యుమెంటేషన్‌తో వారం లోపు పర్సనల్ లోన్ మంజూరవుతుంది. వ్యక్తిగత రుణాలపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 8.90 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. ఈ పర్సనల్ లోన్ ఏ అవసరానికైనా వాడుకోవచ్చు. ఐదేండ్ల కాల పరిమితి వరకు గడువు పెట్టుకోవచ్చు. ఎక్కువ ఆదాయ మార్గం ఉంటే ఎక్కువ ఈఎంఐ పే చేసి, త్వరితగతిన రుణం తీర్చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఉదాహరణకు రూ.2.5 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నారనుకుందాం.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 8.9 శాతం వడ్డీపై లోన్ లభిస్తే, కెనరా బ్యాంకులో గరిష్టంగా 13.15 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఎస్బీఐలో 10.55 శాతం వడ్డీ వడ్డిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 11, యాక్సిస్ బ్యాంక్ 12 శాతం వడ్డీ వసూలు చేస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

