సిప్ వాయిదాలు కట్టట్లేదా?
ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ పథకంలో క్రమం తప్పకుండా చిన్నచిన్న మొత్తాలను పెట్టుబడిగా పెట్టేలా వ్యక్తిగత మదుపరులకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఉపకరిస్తుంది. అయితే ఆదాయంలో అనిశ్చితి, ఉద్యోగ సమస్యలు, ఇతరత్రా ఆర్థిక ఇబ్బందులతో మదుపరులు సిప్ వాయిదాలను చెల్లించలేకపోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది?
ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ పథకంలో క్రమం తప్పకుండా చిన్నచిన్న మొత్తాలను పెట్టుబడిగా పెట్టేలా వ్యక్తిగత మదుపరులకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఉపకరిస్తుంది. అయితే ఆదాయంలో అనిశ్చితి, ఉద్యోగ సమస్యలు, ఇతరత్రా ఆర్థిక ఇబ్బందులతో మదుపరులు సిప్ వాయిదాలను చెల్లించలేకపోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది?
3 నెలలు కట్టకపోతే..
సిప్ వాయిదాలను చెల్లించకపోతే సదరు మదుపరిపై మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఏ జరిమానాలు వేయవు. అయితే వరుసగా 3 నెలలపాటు వాయిదాలు కట్టకపోతే మీ పథకం దానంతటదే రద్దయిపోతుంది.
బ్యాంకుల్లో జరిమానాలు
మదుపరులు తమ సిప్ ఆటో డెబిట్ పేమెంట్లను పూర్తిచేయలేకపోతే బ్యాంకులు జరిమానా వేసే అవకాశాలున్నాయి. ఖాతాలో సరిపడా నగదు లేదంటూ చార్జీలు పడతాయి.
మదుపరులు ఏం చేయాలి?
ఆర్థిక సమస్యలుంటే సిప్‌ను నిలిపి ఉంచాలంటూ ముందుగానే మ్యూచువల్ ఫండ్ సంస్థకు మదుపరులు తెలియపర్చాలి. ఇందుకోసం సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఎంచుకున్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) వెబ్సైట్ ఆధారంగా తమ ఖాతాను మదుపరులు తెరవాలి. అకౌంట్ లాగిన్ తర్వాత సిప్ లావాదేవీలను ఎంచుకొని, ‘పాస్ సిప్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో నెల నుంచి 6 నెలలదాకా విరామాన్ని కోరుకునే అవకాశం దొరుకుతుంది. ఈ మేరకు బ్యాంకులకు ఏఎంసీలు సందేశమిస్తాయి. అయితే కొన్ని ఏఎంసీలు 3 నెలలకు మించి విరామాన్ని ఇవ్వడం లేదు. అలాగే ఈ సమయం ముగిసిన తర్వాత వాటంతటవే సిప్ వాయిదాలు యాక్టీవ్ అవుతాయన్న విషయం మరువరాదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- banks
- Mutual fund
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

