ముంబై, జనవరి 20: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.11,052.60 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.8,792.42 కోట్ల కంటే ఇది 25.7 శాతం అధికం.
నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.4 శాతం ఎగబాకి రూ.18, 678 కోట్లకు చేరుకున్నది. బ్యాంక్‌నకు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం 20 శాతం అధికమై రూ.5,975 కోట్లకు చేరుకున్నా యి. మొండి బకాయిలకోసం బ్యాంక్ నిధు ల కేటాయింపులు రూ.2,257.44 కోట్ల నుంచి రూ.1,049.37 కోట్లకు తగ్గాయి.