హౌజింగ్‌లో హైదరాబాదే టాప్
ఇండ్ల అమ్మకాల్లో హైదరాబాద్ హవా కొనసాగుతున్నది. ఈ ఏడాది తొలి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అగ్రస్థానంలో ఉన్నట్టు ప్రముఖ రెసిడెన్షియల్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్.కామ్ తెలిపింది. గత ఏడాది జనవరి-మార్చిలో హైదరాబాద్‌లో 6,560 యూనిట్ల విక్రయాలు జరుగగా.. ఈ ఏడాది ఇదే వ్యవధిలో 10,200 యూనిట్లు అమ్ముడయ్యాయి.
- జనవరి-మార్చిలో రికార్డుస్థాయి అమ్మకాలు
- దేశంలోని 8 ప్రధాన నగరాలపై ప్రాప్‌టైగర్.కామ్ నివేదిక
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఇండ్ల అమ్మకాల్లో హైదరాబాద్ హవా కొనసాగుతున్నది. ఈ ఏడాది తొలి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అగ్రస్థానంలో ఉన్నట్టు ప్రముఖ రెసిడెన్షియల్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్.కామ్ తెలిపింది. గత ఏడాది జనవరి-మార్చిలో హైదరాబాద్‌లో 6,560 యూనిట్ల విక్రయాలు జరుగగా.. ఈ ఏడాది ఇదే వ్యవధిలో 10,200 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో 55 శాతం వృద్ధి నమోదైంది. ఈ స్థాయిలో దేశంలో మరెక్కడా ఈసారి పెరుగలేదని ‘రియల్ ఇన్సైట్ రెసిడెన్షియల్-జనవరి-మార్చి 2023’ పేరుతో విడుదల చేసిన తమ తాజా నివేదికలో ప్రాప్‌టైగర్.కామ్ తెలియజేసింది.
హైదరాబాద్‌తోపాటు ముంబై, పుణె, ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్‌ల్లో ఇండ్ల అమ్మకాలు, కొత్త నిర్మాణాల ప్రారంభంపై ప్రాప్‌టైగర్.కామ్ ఈ నివేదికను రూపొందించింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో ఈ 8 నగరాల్లో 85,850 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. నిరుడు ఇదే త్రైమాసికంలో 70,630 యూనిట్లుగానే ఉన్నాయి. అలాగే కొత్త నిర్మాణాల ప్రారంభం కూడా 86 శాతం ఎగిసి 79,530 యూనిట్ల నుంచి 1,47,780 యూనిట్లకు పెరిగింది. ఇదిలావుంటే ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్‌కతా, బెంగళూరుల్లో ఈసారి అమ్మకాలు పడిపోయాయని తేలింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

