హైదరాబాద్, అక్టోబర్ 26: హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఇప్పటికే పలు గ్లోబల్ సదస్సులు ఇక్కడ జరగగా..తాజాగా వచ్చే నెల 2 నుంచి 4 వరకు ఇండియా గేమ్ డెవలపర్ల సదస్సు జరగబోతున్నది. దక్షిణాసియాలో అతిపెద్ద గ్లోబల్ సమావేశం హైదరాబాద్లోని హెచ్ఐఐసీలో జరుగుతుండటం విశేషం.
ఈ సమావేశానికి 150 మంది స్పీకర్లు, 100 సెషన్లు, 4 వేల మంది హాజరుకాబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో ఐడీజీసీ, కృత్రిమ మేధస్సు, వెబ్3, ఆర్ట్ అండ్ డిజైన్, టెక్నాలజీ, ప్రొడక్షన్, బిజినెస్ అండ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్, అప్లయడ్ గేమ్స్, ఎమర్జింగ్ ట్రెండ్స్, కేరియర్ అవకాశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.