Hyderabad | ఇండ్ల విక్రయాల్లో హైదరాబాద్ జోరు.. ఆరు నెలల్లోనే 69 శాతం వృద్ది
Hyderabad | హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడ అమ్మకాలు అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్నాయి. ఏ సర్వే చూసిన ఈ విషయం స్పష్టమవుతున్నది. తాజాగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జెఎల్ఎల్ వెల్లడించిన నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో క్రమంగా క్రయవిక్రయాల్లో దూసుకుపోతుందని తేలింది.
Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడ అమ్మకాలు అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్నాయి. ఏ సర్వే చూసిన ఈ విషయం స్పష్టమవుతున్నది. తాజాగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జెఎల్ఎల్ వెల్లడించిన నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో క్రమంగా క్రయవిక్రయాల్లో దూసుకుపోతుందని తేలింది.
మౌలిక వసతులకు రాష్ట్ర సర్కార్ పెద్దపీట వేస్తుండటంప్రత్యేక దృష్టి సారించడంతోపాటు అందుబాటులో ధరలు ఉండటంతో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో(జనవరి నుంచి జూన్) అమ్మకాలు 69 శాతం పెరుగుదల కనిపించింది. సంఖ్యపరంగా చూస్తే బెంగళూరు, ముంబై, పుణె వంటి నగరాలు ముందు వరుసలో ఉండగా..వృద్ధి పరంగా చూస్తే మాత్రం హైదరాబాద్ ఇతర మెట్రో నగరాలకు అందనంత ఎత్తులో కొనసాగుతన్నది.
ఏటాటా పెరుగుతున్న విక్రయాలు..
హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, పుణె, ముంబై నగరాలల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టుల క్రయవిక్రయాలపై జేఎల్ఎల్ అధ్యయనం చేసింది. ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో అత్యధిక వృద్ధి నమోదైనట్లుగా తేలింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో క్రయవిక్రయాల్లో ఏకంగా 69 శాతం వృద్ధి నమోదైంది. 2022 జనవరి – జూన్ 30 నాటికి 9,449 యూనిట్లు అమ్ముడవగా..ఈ ఏడాదిలో ఏకంగా 15,925 యూనిట్లకు చేరుకున్నట్లు నివేదిక వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!


