BMS | బీఎంఎస్తో ఫార్మాకు ఊపు.. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులకు అవకాశం
BMS | ప్రపంచ ప్రఖ్యాత ఔషధ కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన బయో ఫార్మా కంపెనీ బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ (బీఎంఎస్) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ఇక్కడి ఔషధ రంగానికి మరింత బలాన్ని చేకూర్చింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ప్రఖ్యాత ఔషధ కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన బయో ఫార్మా కంపెనీ బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ (బీఎంఎస్) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ఇక్కడి ఔషధ రంగానికి మరింత బలాన్ని చేకూర్చింది. హైదరాబాద్ కేంద్రంగా బీఎంఎస్ దీర్ఘకాల వ్యాధులకు ఔషధాల అభివృద్ధి, నూతన ఆవిష్కరణలను చేపట్టనున్నది. ఇది.. ఇప్పటికే దేశంలో ఔషధ రంగానికి ప్రధాన కేంద్రంగా మారిన తెలంగాణలో మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు దోహదం చేయనున్నది. క్యాన్సర్, హెచ్ఐవీ/ఎయిడ్స్, కార్డియోవాస్కులర్ డిసీజ్, మధుమేహం, హెపటైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, వివిధ రకాల మానసిక రుగ్మతలు తదితర వ్యాధులకు ఔషధాలు, బయోలాజిక్స్లను బీఎంఎస్ తయారు చేస్తుంది.
2021లో కంపెనీ ఆర్అండ్డీపై ప్రపంచవ్యాప్తంగా 9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇందులో కొత్త ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి తదితర కార్యక్రమాలున్నాయి. దీర్ఘకాల రోగాలకు కొత్త రకం ఔషధాలను కనుగొనడం, అభివృద్ధి చేయడం, పంపిణీ చేయడం ముఖ్య లక్ష్యాలుగా పనిచేస్తున్న ఈ కంపెనీ.. 30 విభిన్న రకాల ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నది. ఇది ఫార్చూన్ 500 కంపెనీల జాబితాలోనూ ఉన్నది. మరోవైపు, కంపెనీకి భారత్లో బెంగళూరుతోపాటు పలు ప్రపంచ దేశాల్లో పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసింది.
సంస్థ: బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్
ప్రధాన కేంద్రం: న్యూయార్క్ (అమెరికా)
స్థాపించినది: 1887లో
చైర్మన్, సీఈవో: గియోవన్నీ కఫోరియో
పరిశ్రమ: ఫార్మాస్యూటికల్స్
మొత్తం ఆస్తులు: 96.82 బిలియన్ డాలర్లు (2022)
రెవెన్యూ: 46.16 బిలియన్ డాలర్లు (2022)
ఉద్యోగులు: 34,300 మంది (2022)
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

