Hurun India | ముంబై, డిసెంబర్ 18: రాధాకిషన్ దమానీ నేతృత్వంలోని సూపర్‌మార్కెట్ బ్రాండ్ డీమార్ట్.. దేశంలోనే స్వయంకృషితో ఎదిగిన సంస్థల్లో అత్యంత విలువైనదని బుధవారం విడుదలైన జాబితాలో ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్, హురున్ ఇండియా పేర్కొన్నాయి. సెల్ఫ్-మేడ్ ఎంటర్ప్రెన్యూర్ ద్వారా 2000వ సంవత్సరం తర్వాత ఏర్పడ్డ 200 కంపెనీలతో ఓ లిస్ట్‌ను ఐడీఎఫ్సీ ఫస్ట్, హురున్ తయారు చేశాయి.
ఇందులో రూ.3.42 లక్షల కోట్ల విలువతో డీమార్ట్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది డీమార్ట్ యాజమాన్య సంస్థ అవెన్యూ సూపర్మార్కెట్స్ విలువ 44 శాతం పుంజుకున్నట్టు తెలిపింది. ఇక డీమార్ట్ తర్వాత ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ ఉన్నాయి.