Cash Witout Debit Card | డెబిట్ కార్డు లేకున్నా ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా.. ఇవీ ఆర్బీఐ గైడ్‌లైన్స్
Cash Witout Debit Card | డెబిట్ కార్డు లేకున్నా.. మొబైల్ యాప్స్ సాయంతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఏటీఎంల వద్ద క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చునని ఆర్బీఐ గైడ్ లైన్స్ జారీ చేసింది.
Cash Witout Debit Card | దాదాపు పదేండ్ల క్రితం వరకు నగదు విత్ డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డుతో ఏటీఎం దగ్గరికెళ్లాలి.. ఇప్పుడు మొబైల్ యాప్ ఆధారిత పేమెంట్స (యూపీఐ) ఎక్కువయ్యాయి. అందరూ దాదాపుగా ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. ఎంత డిజిటల్ సేవలకు మళ్లినా.. ఒక్కోసారి క్యాష్ అవసరం రావచ్చు. అటువంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం వద్దకెళ్లి మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్ ఫోన్ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ – UPI) సాయంతో క్యాష్ తీసుకునే వెసులుబాటు ఆర్బీఐ తీసుకొచ్చింది. అన్ని బ్యాంకుల ఏటీఎంల వద్ద డెబిట్ కార్డు రహిత లావాదేవీలు పూర్తి చేయొచ్చు. డెబిట్ కార్డు లేకున్నా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల సాయంతో మనీ విత్ డ్రా చేసుకోవచ్చు.
మొబైల్ యాప్స్ సాయంతో డెబిట్ కార్డు లేకున్నా మనీ విత్ డ్రా చేసుకోవాలని భావించే వారు.. ముందుగా తాము వెళ్లిన ఏటీఎంకు యూపీఐ యాప్ పని చేస్తుందా? లేదా? అనే సంగతి తెలుసుకోవాలి. అలాగే మీ మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ పని చేస్తుందా? అన్నది చెక్ చేసుకోవాలి.
తర్వాత మీరు వెళ్లిన ఏటీఎం స్క్రీన్ మీద విత్ డ్రా సెక్షన్లో క్యూఆర్ కోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే తాత్కాలిక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఇది ఒకసారి మాత్రమే ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. అటుపై మీ మొబైల్ యాప్‌లోని ‘క్యూఆర్ కోడ్ స్కానర్’ ఆప్షన్ వినియోగించి ఏటీఎం స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.. అటుపై యూపీఐ పిన్ నమోదు చేసి ట్రాన్సాక్షన్ పూర్తి చేసేయవచ్చు. ఫోన్ పే, జీ-పే వంటి యాప్స్‌తోపాటు సంబంధిత బ్యాంకుల యాప్స్ కూడా వాడొచ్చు. ఎస్బీఐ ఖాతాదారులు యోనో, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులైతే ఐ-మొబైల్ యాప్ వాడాలి.
యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి ప్రతి నెలా రూ. లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చునని ఆర్బీఐ తన గైడ్‌లైన్స్‌లో సూచించింది. బ్యాంకుల నిబంధనలకు అనుగుణంగా డైలీ విత్ డ్రాయల్ లిమిట్స్ ఉంటాయి. డెబిట్ కార్డు లేకుండా ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకునే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తి.. డబ్బు రాకుంటే.. సమీపంలో గల బ్యాంకు ఖాతాలో సమాచారం ఇస్తే.. కొద్ది రోజుల తర్వాత ఆ డబ్బు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

