సిబిల్ స్కోర్ అనేది ప్రతీ వ్యక్తి రుణ చరిత్రకు అద్దం పడుతుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం రుణగ్రహీత సామర్థ్యాన్ని, ఆర్థిక క్రమశిక్షణను దీని ఆధారంగానే అంచనా వేస్తాయి. సిబిల్ స్కోర్ ఆకర్షణీయంగా ఉంటే పిలిచిమరి లోన్లు ఇస్తారంటే అతిశయోక్తి కాదు. వడ్డీరేట్లూ అందరికంటే తక్కువగానే ఉంటాయి.
రుణగ్రహీతల చెల్లింపులు, రుణాల అవసరం, మిగిలిన బకాయిల ఆధారంగా సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్‌ను లెక్కిస్తారు. 750-900 మధ్య మీ స్కోర్ ఉంటే అత్యుత్తమం అని చెప్పుకోవచ్చు. 650-750 మధ్య ఉన్నట్టయితే గుడ్‌గా భావిస్తారు. 550-650 మధ్య యావరేజ్, అంతకంటే తక్కువగా ఉంటే అధ్వాన్నంగా పేర్కొనాల్సి వస్తుంది. దేశంలోని క్రెడిట్ బ్యూరోల్లో సిబిల్ అనేది ఒకటన్న విషయం తెలిసిందే. స్కోర్ బాగుండాలంటే ఈ 10 సూత్రాలు గుర్తుంచుకోండి.
1. తీసుకున్న రుణాలకు సంబంధించిన చెల్లింపులు సక్రమంగా ఉండాలి
2. మితిమీరిన రుణ భారం వద్దు. దీనివల్ల డిఫాల్టర్ ముద్రపడొచ్చు
3. ఎప్పటికప్పుడు సిబిల్ స్కోర్‌ను చెక్ చేసుకోవాలి. అప్డేట్ ఉంటే సరిచేయించుకోవాలి
4. క్రెడిట్ కార్డులను తెలివిగా వాడుకోవాలి. దుర్వినియోగం చేయవద్దు
5. రుణ పరిమితి పెరిగే అవకాశాలను పెంపొందించుకోవాలి
6. జాయింట్ అకౌంట్లతో జాగ్రత్తగా ఉండాలి. మీ సహచరులు చేసే పొరపాట్లు మీ క్రెడిట్ స్కోర్‌ను రిస్కులో పెట్టవచ్చు
7. గ్యారెంటీ విషయంలో తొందరపడవద్దు.
8. ఆర్థిక క్రమశిక్షణతో మెలగాలి. మీరు తీసుకునే అప్పులు, చెల్లించే విధానాలన్నీ రికార్డవుతాయన్నది మరువద్దు
9. దీర్ఘకాలిక రుణాలకే పరిమితం కావద్దు. స్వల్పకాలిక రుణాలనూ తీసుకోండి
10. తరచూ రుణాల కోసం ఆరా తీయడం వల్ల ముప్పే. క్రెడిట్ స్కోర్ కోత పడేందుకు ఇది దారితీస్తుంది