Hyderabad | హైదరాబాద్‌లో అంతకంతకూ పెరుగుతున్న ఇండ్ల ధరలు
దరాబాద్‌లో ఇండ్ల ధరలు అంతకంతకూ పెరుగుతూపోతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, వ్యాపారాలు-పరిశ్రమల నిర్వహణ మెరుగ్గా ఉండటంతో అంతా ఇక్కడ స్థిర నివాసానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
- ఈ ఏప్రిల్-జూన్‌లో 6.9 శాతం పెరిగిన ధరలు
- వెల్లడించిన నేషనల్ హౌజింగ్ బ్యాంక్
- దేశంలోని 50 నగరాలపై నివేదిక
- నానాటికీ ఆకర్షణీయంగా నగర రియల్టీ
న్యూఢిల్లీ, ఆగస్టు 30: హైదరాబాద్‌లో ఇండ్ల ధరలు అంతకంతకూ పెరుగుతూపోతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, వ్యాపారాలు-పరిశ్రమల నిర్వహణ మెరుగ్గా ఉండటంతో అంతా ఇక్కడ స్థిర నివాసానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే నివాస గృహాల ధరలు పరుగులు పెడుతున్నాయి. నేషనల్ హౌజింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) తాజా నివేదిక ఇందుకు అద్దం పడుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను హైదరాబాద్‌సహా దేశంలోని 50 నగరాల్లో ఇండ్ల ధరలపై ఎన్‌హెచ్‌బీ నివేదిక రూపొందించింది. హౌజింగ్ ప్రైస్ ఇండెక్స్ (హెచ్పీఐ) పేరుతో ఆ వివరాలను విడుదల చేసింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోల్చితే హైదరాబాద్‌లో ఇండ్ల ధరలు 6.9 శాతం ఎగబాకినట్టు తేలింది.
7 నగరాల్లో..
దేశవ్యాప్తంగా 50 నగరాల్లోని ఇండ్ల ధరలను హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల రెగ్యులేటర్ ఎన్‌హెచ్‌బీ ఆరా తీసింది. దీంతో 43 నగరాల్లో గతంతో పోల్చితే ఈ ఏప్రిల్-జూన్‌లో పెరిగాయని, 7 నగరాల్లో మాత్రం తగ్గాయని స్పష్టమైంది. బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి సేకరించిన ప్రాపర్టీ ధరలు, వాటి విలువల ఆధారంగా ఈ రిపోర్టును ఎన్‌హెచ్‌బీ తయారు చేసింది. అయితే వడ్డీరేట్లు పెరిగినా గృహ రుణాలు ఇంకా అందరికీ అందుబాటులోనే ఉంటుండటం మార్కెట్‌కు కలిసొస్తున్నదని ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌బీ అభిప్రాయపడింది.
రికార్డు ధరల్లో భూములు
జీహెచ్ఎంసీ పరిధిలో హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న భూముల వే లంలో ధరలు ఏ స్థాయి లో పలుకుతున్నాయో చూస్తూనే ఉన్నాం. మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఎకరం గరిష్ఠంగా 100 కోట్లకు అమ్ముడవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ చేపట్టే నిర్మాణాల ధరలకు ఆకాశమే హద్దవుతున్నది. ఈ స్థాయిలో డిమాండ్ ఉండటానికి కారణం.. రాష్ట్ర ప్రభు త్వ సుస్థిర పాలన, తీసుకుంటున్న నిర్ణయాలు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు, కీలక రంగాల్లో అభివృద్ధి, వస్తున్న ఉద్యోగాలు, పెరుగుతున్న ఆదాయ వనరులేనని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెప్తున్నారు.
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో.. నగరం ఇండ్ల ధరల్లో
వృద్ధి (శాతంలో)
అహ్మదాబాద్ 9.1
బెంగళూరు 8.9
కోల్‌కతా 7.8
హైదరాబాద్ 6.9
పుణె 6.1
ముంబై 2.9
చెన్నై 1.1
ఢిల్లీ 0.8
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

