న్యూఢిల్లీ : దేశీ మార్కెట్లో హోండా గ్రేజియా 125 రెప్సోల్ హోండా టీం ఎడిషన్‌ను హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లాంఛ్ చేసింది. స్పోర్టీ లుక్‌తో ఆరెంజ్ వీల్ రిమ్స్‌తో న్యూ హోండా గ్రేజియా 125 రెప్సోల్ కస్టమర్లను ఆకట్టుకోనుంది.
భారత్‌లో రేసింగ్ ఔత్సాహికుల కోసం న్యూ గ్రేజియా 125 రెప్సోల్ హోండా టీం ఎడిషన్‌ను లాంఛ్ చేశామని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, ప్రెసిడెంట్, సీఈఓ అటుషి ఒగటా తెలిపారు.