స్ప్లెండర్కు పోటీగా నయా బైక్.. హీరోకు హోండా సవాల్..!
Honda Vs Hero | హీరో స్ప్లెండర్కు పోటీగా 100సీసీ బైక్ తెస్తామని హోండా మోటార్ సైకిల్స్ ప్రెసిడెంట్ అతుషి ఒగాటా వెల్లడించారు.
Honda Vs Hero | దేశంలోనే అతిపెద్ద టూ వీలర్ కంపెనీలవి.. ఒక దాంతో మరొకటి పోటీ పడేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అవే హీరో మోటో కార్ప్.. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా.. దేశవ్యాప్తంగా హీరో స్ప్లెండర్ ప్రతి కుర్రాడి చేతిలో ఉందంటే అతిశయోక్తి కాదు.. 100 సీసీ సామర్థ్యం గల ఈ వెహికల్‌కు పోటీ వచ్చే బైక్ లేదు.. కానీ.. ఇప్పుడు హోండా మోటార్స్ సైకిల్స్.. స్ప్లెండర్‌తో పోటీగా మరో బైక్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఆటో ఇండస్ట్రీ బాడీ.. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చర్స్ (సియామ్ SIAM) 62వ వార్షిక సదస్సులో హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా సీఈవో కం ఎండీ, అధ్యక్షుడు అతుషి ఒగాటా ఈ సంగతి చెప్పారు.
తాము కొన్ని నెలల్లో 100 సీసీ మోటార్ సైకిల్‌ను మార్కెట్లోకి తెస్తున్నట్లు అతుషి ఒగాటా తెలిపారు. తాము తీసుకొచ్చే 100 సీసీ హోండా బైక్ ఆకర్షణీయ ధరకు అందుబాటులోకి తెస్తాం అని అన్నారు. స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్ కంటే ఆకర్షణీయంగా రూపొందిస్తామని తెలిపారు.
`దేశంలో మోటార్ సైకిల్ పరిశ్రమ.. ప్రత్యేకించి 125 సీసీ సెగ్మెంట్ పెరుగుతోంది. మాకు షైన్, ఎస్పీ 125 బైక్‌లు ఉన్నాయి. కొన్ని ప్రధాన నగరాల కుర్రాళ్లు..దూర ప్రాంతం ప్రయాణాలు చేయడానికి వీలుగా ఉండే షైన్, ఎస్పీ 125 వంటి బైక్‌ల పట్ల ప్రధానంగా గ్రామీణ యువకులకు మోజెక్కువే. ఈ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ బ్యాటరీ సిస్టమ్ వెహికల్స్‌కు డిమాండ్ లేదు. యూత్ అవసరాలకు అనుగుణంగా 125సీసీ, 100సీసీ లైనప్‌తో సంబంధం లేకుండా బైక్స్‌ను తీసుకు రావాలని భావిస్తున్నాం. ప్రస్తుతం మా వద్ద 100సీసీ బైక్ లేదు. త్వరలో ఆ సెగ్మెంట్లో బైక్ మార్కెట్లోకి తెస్తాం` అని ఓ ఇంటర్వ్యూలో అతుషి ఒగాటా చెప్పారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన బైక్ హీరో స్ప్లెండర్. 26.66 లక్షలకు పైగా బైక్స్ అమ్ముడయ్యాయి. హీరో బైక్స్‌లో 100 సీసీ సామర్థ్యం లోపు బైక్స్ విక్రయాలు 80 శాతం. వాటిలో స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్ కూడా ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో ప్రతి నెలా సగటున 3.5 లక్షల బైక్స్ అమ్ముడవుతున్నాయి. హోండా బైక్స్, స్కూటర్లలో బెస్ట్ సెల్లింగ్ మోడల్ యాక్టీవా.. గత ఆర్థిక సంవత్సరంలో 17 లక్షలకు పైగా అమ్ముడైంది. అయినా స్ప్లెండర్ కంటే వెనుకబడి ఉందని అతుషి ఒగాటా తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

