SBI Home Loan Offers | ఇండ్ల రుణాలపై ఎస్బీఐ బంపర్ ఆఫర్.. ఇవీ డిటైల్స్..!
SBI Home Loan Offers | సొంతింటి కల సాకారం చేసుకునే వారికి ఎస్బీఐ బంపర్ ఆఫర్ అందిస్తోంది. సిబిల్ స్కోర్ ఉన్నా.. లేకున్నా 65 బేసిక్ పాయింట్ల వడ్డీరేట్లు తగ్గిస్తోంది.
SBI Home Loan Offers | మీరు సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా.. అందుకు ఇంటి రుణం తీసుకోవాలని యోచిస్తున్నారా.. కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మీకు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. పండుగల సీజన్ నేపథ్యంలో ప్రత్యేకంగా ప్రచారోద్యమం చేపట్టింది. డిసెంబర్ 31 వరకూ ఎస్బీఐ ఈ రాయితీ అందిస్తుంది. ఇండ్ల రుణాలపై వడ్డీరేటులో గరిష్టంగా 65 బేసిక్ పాయింట్ల వరకూ రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం ఎస్బీఐ ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు 9.15 – 9.65 శాతం మధ్య ఉన్నాయి. తాజాగా ఆ బ్యాంకు ప్రకటించిన స్పెషల్ క్యాంపెయిన్ వల్ల వడ్డీరేట్లు 8.6 నుంచి 9.65 శాతం మధ్య ఖరారవుతాయి. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్న వారికి తక్కువ వడ్డీరేటుపైనే రుణాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్స్ టర్న్ బెంచ్ మార్క్ రేట్ ప్రకారం ఇండ్ల రుణాలపై వడ్డీరేటు 9.15 శాతం కాగా, 750-800 మధ్య సిబిల్ స్కోర్ ఉన్న వారికి గరిష్టంగా 55 బేసిక్ పాయింట్ల వడ్డీ మాఫీ చేస్తారు. అంటే 8.60 శాతానికే వడ్డీ అందిస్తుంది ఎస్బీఐ.
700-749 మధ్య సిబిల్ స్కోర్ గల వారికి గరిష్టంగా 65 బేసిక్ పాయింట్ల వడ్డీ తగ్గుతుంది. ఈ క్రెడిట్ స్కోర్ గల వారికి ప్రస్తుతం 9.35 శాతం వడ్డీపై రుణాలు ఇస్తుండగా, 8.70 శాతానికే రుణం లభిస్తుంది. 650-699 మధ్య సిబిల్ స్కోర్ గల వారికి 9.45 శాతం, 550-649 మధ్య క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి 9.65 శాతం వడ్డీపై రుణాలు ఇస్తారు. ఇక 151-200 పాయింట్ల మధ్య సిబిల్ స్కోర్ ఉన్నా, 65 బేసిక్ పాయింట్లు, ఎటువంటి సిబిల్ స్కోర్ లేకపోయినా 45 బేసిక్ పాయింట్లు వడ్డీ తగ్గిస్తోంది ఎస్బీఐ. పూర్తి వివరాల కోసం ఎస్బీఐ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

