Property Insurance | గృహ బీమా అంటే? ఇది ఎలా పనిచేస్తుంది
గృహ బీమాను ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లేదా హోమ్ ఓనర్ ఇన్సూరెన్స్‌గా కూడా పిలుస్తారు. ఇది మీ ఇంటికయ్యే ఎక్స్టీరియర్-ఇంటీరియర్ డ్యామేజీలను, వాటిల్లే నష్టాలకు కవరేజీనిస్తుంది.
గృహ బీమాను ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లేదా హోమ్ ఓనర్ ఇన్సూరెన్స్‌గా కూడా పిలుస్తారు. ఇది మీ ఇంటికయ్యే ఎక్స్టీరియర్-ఇంటీరియర్ డ్యామేజీలను, వాటిల్లే నష్టాలకు కవరేజీనిస్తుంది. ఇంట్లోని వస్తుసామాగ్రీకి కూడా బీమా రక్షణ లభిస్తుంది. ఇంట్లో దురదృష్టవశాత్తూ జరిగే ఏదైనా ప్రమాదాలకూ వర్తిస్తుంది.
Property Insurance | హోమ్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని పలు కంపెనీలు అందిస్తున్నాయి. వాటిలో ఎస్బీఐ, శ్రీరామ్ జనరల్, బజాజ్ అలియాంజ్, భారతీ యాక్సా, రాయల్ సుందరం, రిలయన్స్, రహేజా క్యూబీఈ, ఓరియంటల్, న్యూ ఇండియా అష్యూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరాలీ, చోళమండలం వంటి సంస్థలున్నాయి. ఇండ్ల యజమానులు, అద్దెకుండేవారు ఈ బీమాను తీసుకోవచ్చు. కొన్ని సంస్థలు హౌజింగ్ సొసైటీలకూ బీమాను ఇస్తున్నాయి. తీవ్రవాదుల దాడి, భూకంపాల్లో ధ్వంసమైనా బీమాను ఇస్తామని మరికొన్ని సంస్థలు ప్రకటిస్తున్నాయి.
కవరేజీ ఇలా..
షరతులు, ప్రీమియంలనుబట్టి ఆయా సంస్థలు.. అగ్ని ప్రమాదాలు, డాక్యుమెంట్ల నష్టం, దొంగతనాలు, గృహోపకరణాల డ్యామేజీ, వ్యక్తిగత ప్రమాద బీమా, అద్దె ఎగవేత, పెంపుడు జంతువుల సంరక్షణ, ఇల్లు పూర్తిగా దెబ్బతింటే ప్రత్యామ్నాయ వసతి ఖర్చులు, బ్యాగేజీ నష్టం, థర్డ్ పార్టీ-ఎంప్లాయ్ లయబిలిటీస్, ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ కవరేజీలను అందిస్తున్నాయి. ఇంట్లోని విలువైన ఎలక్ట్రిక్-ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నీచర్, ఆభరణాలకూ బీమా కవరేజీ ఉంటుంది. ప్రకృతి విపత్తుల్లో ధ్వంసమైనా, అల్లర్లతో ప్రభావితమైనా ఇన్సూరెన్స్‌ను పొందవచ్చు. ఒకవేళ గృహ రుణం పరిధిలో ఇల్లు ఉన్నైట్టెతే ప్రీమియంలు అధికంగా ఉంటాయి.
పాలసీ కాలపరిమితి
గృహ బీమా పాలసీలు దీర్ఘకాలానికిగాను కొనుక్కోవచ్చు. అలాగే కనిష్ఠంగా ఏడాది కాలపరిమితితో కూడా తీసుకోవచ్చు. ఇండిపెండెంట్ హౌజ్‌లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లకు అనుగుణంగా ఈ పాలసీల కవరేజీని ఎంచుకోవచ్చు. నివాస ప్రాంతాన్నిబట్టి, పాలసీ వ్యవధి ఆధారంగా ప్రీమియంలుంటాయి. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఇచ్చే హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ వ్యవధి కనిష్ఠంగా మూడేండ్లు, గరిష్ఠంగా 30 ఏండ్లుగా ఉన్నది. కాగా, వాటిల్లిన నష్టానికి కారణం ఉద్దేశపూర్వక చర్యేనని తేలితే బీమా వర్తించదు. అంటే బీమా సొమ్ము కోసం కావాలనే నష్టపూరిత చర్యలకు పాల్పడితే అనర్హత వేటు పడుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

