Hero Xoom Combat | దేశీయ మార్కెట్లోకి హీరో జూమ్ కంబాట్.. రూ.80,967లకే ఈ స్కూటర్ లభ్యం..!
Hero Xoom Combat | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ దేశీయ మార్కెట్లోకి న్యూ జూమ్ కంబాట్ ఎడిషన్ (Hero Xoom Combat) స్కూటర్‌ను ఆవిష్కరించింది.
Hero Xoom Combat | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ దేశీయ మార్కెట్లోకి న్యూ జూమ్ కంబాట్ ఎడిషన్ (Hero Xoom Combat) స్కూటర్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.80,967 (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. కంపెనీ వెబ్ సైట్లో లిస్టింగ్ ప్రకారం ‘న్యూ హీరో జూమ్ కంబాట్ ఎడిషన్’ టాప్ వేరియంట్‌గా నిలుస్తుంది. జూమ్ జడ్ఎక్స్ స్కూటర్‌తో పోలిస్తే బెల్స్, విజిల్స్ జత కలవడంతో మరో రూ.1000 కాస్ట్ అవుతుంది. బాడీ వర్క్ అంతటా కాంట్రాస్ట్ గ్రాఫిక్స్‌తోపాటు న్యూ మ్యాట్ షాడో గ్రే పెయింట్ స్కీం వస్తుంది. జెట్ ఫైటర్స్ స్ఫూర్తితో న్యూ కలర్ స్కీమ్‌తో హీరో జూమ్ కంబాట్ స్కూటర్ చూడటానికి షార్పర్గా, స్పోర్టీ లుక్ తో కనిపిస్తుంది.
హీరో జూమ్ కంబాట్ స్కూటర్ 110.9 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో వస్తుంది. సీవీటీ యూనిట్‌తో రూపుదిద్దుకున్న ఈ ఇంజిన్ గరిష్టంగా 7250 ఆర్పీఎం వద్ద 8.05 బీహెచ్పీ విద్యుత్, 5750 ఆర్పీఎం వద్ద 8.7 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో సింగిల్ షాక్ అబ్జార్బర్ ఉంటాయి. ప్రామాణికంగా కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్) తోపాటు రేర్‌లో డ్రమ్ బ్రేక్, ఫ్రంట్‌లో డిస్క్ బ్రేక్ ఉంటాయి. బ్లూటూత్ కనెక్టివిటీతోపాటు ఫుల్లీ డిజిటల్ కన్సోల్, సిగ్నేచర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తోపాటు ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, హెచ్-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్ జత చేశారు.
హీరో మోటో కార్ప్ తన జూమ్ రేంజ్‌ను రెండు మోడల్స్‌లోకి విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఎక్మా 2023లో జూమ్ 125ఆర్, జూమ్ 160 స్కూటర్లను ప్రదర్శించింది. వీటిని మరికొన్ని వారాల్లో మార్కెట్లో ఆవిష్కరించనున్నది. రెండు మోడల్ స్కూటర్లు కూడా ప్రీమియం ఆఫర్లతో హీరో 2.0, న్యూ ప్రిమియా డీలర్ షిప్‌ల వద్ద లభిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

