Hero Electric Scooter | త్వరలో మార్కెట్లోకి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతో తెలుసా?
Hero MotoCorp | హీరో మోటోకార్ప్ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో విడుదల చేయనున్నది. ఈ ఏడాది అక్టోబర్ 7న లాంచ్ చేయనుండగా.. ఈ వెంట్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనున్నది. ఈ మేరకు కంపెనీ డీలర్లు, పెట్టుబడిదారులు,
Hero Electric Scooter | హీరో మోటోకార్ప్ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో విడుదల చేయనున్నది. ఈ ఏడాది అక్టోబర్ 7న లాంచ్ చేయనుండగా.. ఈ వెంట్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనున్నది. ఈ మేరకు కంపెనీ డీలర్లు, పెట్టుబడిదారులు, గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్లకు లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన ఆహ్వానాలు పంపింది. హీరో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సబ్ బ్రాండ్ అయిన విడా (Vida) పేరిట విడుదల చేయనున్నది. మోడల్, ధరలు రాబోయే రోజుల్లో ప్రకటించనుండగా.. ఈ స్కూటర్ ధర రూ.లక్ష వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.
హీరో తన సబ్ బ్రాండ్ అయిన విడాను ఈ ఏడాది జూలై 1న ప్రకటించింది. ప్రస్తుతానికి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ఇప్పటి వరకు కంపెనీ ప్రకటించలేదు. ఇంతకు ముందు ఈవీ, బ్యాటరీ మార్పిడి నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు తైవాన్‌కు చెందిన సంస్థ గొగోరోతో హీరో మోటాకార్ప్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. గొగోరో సంస్థకు రెండువేల బ్యాటరీ మార్పిడి పాయింట్లు ఉండగా.. వాటి ద్వారా 3.75లక్షల మంది రైడర్లకు సేవలు అందిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉండగా.. హీరో గట్టి పోటీని ఎదుర్కోనున్నది.
అయితే, హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఈ ఏడాది మార్చిలోనే విడుదల చేయాలని నిర్ణయించినా.. పలు కారణాలతో ఆలస్యమైంది. హీరో కొత్త ఈ-స్కూటర్ జైపూర్‌లోని ఆర్అండ్డీ హబ్ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (CIT)లో అభివృద్ధి చేయగా.. ఆంధ్రప్రదేశ్‌లోని కంపెనీ ప్లాంట్‌లో తయారు చేస్తున్నది. ఇదిలా ఉండగా.. హీరో మోటోకార్ప్ సంస్షథ రెండు కొత్త 300సీసీ బైక్‌లను పరీక్షిస్తున్నది. ఎక్స్ట్రీమ్-300, ఎక్స్‌ప్లస్300పై పని చేస్తున్నది. హీరో ఎక్స్ట్రీమ్ 300 పూర్తిగా ఫెయిర్డ్ బైక్ అయితే, ఎక్స్‌ప్లస్ 300 కొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

