Accident Insurance | ఆపత్కాలంలో ఆదుకునేందుకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్!
Accident Insurance | ఆపత్కాలంలో కుటుంబ యాజమానికి ప్రమాదం జరిగితే కుటుంబానికి రక్షణ కల్పించేందుకు పర్సనల్ యాక్సిడెంట్ బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
Accident Insurance | కుటుంబ యజమానికి ఏ చిన్న ప్రమాదం జరిగినా.. మొత్తం కుటుంబం కూడా మానసికంగా, ఆర్థికంగా దెబ్బ తింటుంది. కనుక ప్రతి కుటుంబ యజమాని తనతోపాటు తన కుటుంబానికి తగిన ఆర్థిక రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకోవాలి. అందుకోసం పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే అంశాన్ని చురుగ్గా పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
కరోనా మహమ్మారి తర్వాత భద్రత కోసం ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీ.. వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణానికి పెద్దపీట వేస్తున్నారు. ఫలితంగా రోడ్లపై వెహికల్స్ పెరిగాయి. రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో అనుకోని ఘటనల నుంచి మనకు స్వీయ రక్షణతోపాటు కుటుంబానికి భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకోవడం చాలా కీలకం. ఇందుకు ఉపకరించేదే పర్సనల ఇన్సూరెన్స్ పాలసీ.. ఏ ఆపద వచ్చినా ఆర్థికంగా కుటుంబానికి రక్షణ కల్పిస్తుంది.
వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు అనూహ్యంగా యాక్సిడెంట్ కావచ్చు. అప్పుడు అందులో ప్రయాణిస్తున్న వారు మరణించవచ్చు.. కొన్ని సందర్భాల్లో పూర్తిగా అంగ వైకల్యానికి గురి కావచ్చు. పాక్షిక అంగ వైకల్యానికి గురి కావచ్చు. ఇటువంటి ఆపత్కాలంలో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ.. సంబంధిత పాలసీదారుడికి జరిగిన నష్టంలో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా హామీగా ఉంటుంది. ఈ పాలసీని 18 ఏండ్ల నుంచి 65 ఏండ్లలోపు వారు కొనుగోలు చేయొచ్చు.
యాక్సిడెంట్ జరిగిన తర్వాత సదరు వ్యక్తికి కొన్నాళ్లపాటు ఆదాయం ఉండకపోవచ్చు. యాక్సిడెంట్‌కు చికిత్స, కుటుంబ నిర్వహణ, రుణాలు తీసుకుంటే ఈఎంఐ చెల్లింపులు తదితర అంశాలు ఉంటాయి. ఇటువంటి అవసరాలు తీరడానికి వీలుగా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి ఒకేసారి కొంత మొత్తం డబ్బు వస్తుంది. దాన్ని కుటుంబ అవసరాలకు వాడుకునే వెసులుబాటు ఉంటుంది.
కొందరు సహాయ విహార యాత్రలు చేస్తుంటారు. ఈ విహార యాత్రల్లో యాక్సిడెంట్ కావచ్చు. ఈ నేపథ్యంలోనే సాహస విహార యాత్రలను కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు.. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీల పరిధిలోకి తెచ్చాయి.
యాక్సిడెంట్లో పాలసీదారుడు మృతి చెందితే, యాక్సిడెంటల్ డెత్ కవరేజీ కింద నామినీకి గానీ, చట్టబద్ధ వారసులకు గానీ హామీ మొత్తం చెల్లిస్తాయి బీమా సంస్థలు. ఒక్కోసారి పాలసీదారు అంగవైకల్యానికి గురై.. ఏ చికిత్స వల్ల కోలుకోలేకపోయినా సదరు వ్యక్తికి ఇచ్చిన హామీ మొత్తం సంబంధిత బీమా కంపెనీ చెల్లిస్తుంది. కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు రెట్టింపు పరిహారం పే చేస్తాయి.
యాక్సిడెంట్లో పాలసీదారు పాక్షికంగా అంగ వికలాంగులైనా, ఏదైనా అవయవం కోల్పోయినా.. వినికిడి లోపం వచ్చినా.. వైద్య చికిత్సకయ్యే ఖర్చు మొత్తం రూల్ ప్రకారం సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీలు అందిస్తాయి. సదరు పాలసీదారు ఆరోగ్య పరిస్థితిని బట్టి పాలసీ హామీ మొత్తంలో 25-90 శాతం మధ్య పొందొచ్చు. చిన్న చిన్న గాయాలైతే, అందుకు అయ్యే ఖర్చులకు డబ్బు అవసరం. ఆ ఖర్చులు భరించేలా పాలసీలో నిబంధనలకు అనుగుణంగా రోజువారీగా గానీ, వారానికోసారి గానీ కొంత మొత్తం ఇన్సూరెన్స్ సంస్థ పే చేస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

