ప్రముఖ బీమా సేవ సంస్థల్లో ఒకటైన ఐసీఐసీఐ లాంబార్డ్.. ‘ఎనీవేర్ క్యాష్‌లెస్’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏ ఆసుపత్రిలోనైనా, ఒకవేళ ఐసీఐసీఐ లాంబార్డ్ ప్రస్తుత నెట్‌వర్క్‌లో భాగం కాకపోయిన నగదు రహిత సౌకర్యాలను పొందేందుకు ఈ కొత్త ఫీచర్‌తో చికిత్స చేపించుకోవచ్చునని తెలిపింది. వినియోగదారులు ఎలాంటి ఖర్చులు భరించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఈ పాలసీతో ఏ ఆసుపత్రిలోనైనా అవాంతరాలు లేని చికిత్సను పొందవచ్చునని, ఈ కొత్త సౌకర్యం ఐఎల్ టేక్కేర్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడైనా వినియోగించుకోవచ్చును. ఇందుకోసం పాలసీదారుడు ఆసుపత్రిలో చేరడానికి 24 గంటల ముందు కంపెనీకి తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. రోగి, పాలసీ వివరాలు, ఆసుపత్రి పేరు, రోగ నిర్థారణ, చికిత్స చేస్తున్న వైద్యుని పేరు తదితర ప్రాథమిక సమాచారాన్ని అందచేయాలి.