Health Insurance | క్యాష్‌లెస్ చికిత్స నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ వరకు.. ఆరోగ్య బీమాలో మార్పులొచ్చాయ్
హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందరికీ దగ్గర చేసేందుకు క్యాష్‌లెస్ చికిత్స నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ వరకు ఇటీవల పలు మార్పులను చేసింది ఐఆర్డీఏఐ.
Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందరికీ దగ్గర చేసేందుకు క్యాష్‌లెస్ చికిత్స నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ వరకు ఇటీవల పలు మార్పులను చేసింది ఐఆర్డీఏఐ.
- వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆరోగ్య బీమాను తీసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు ఇది గొప్ప ఊరట.
- గుండె జబ్బు, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, ఎయిడ్స్ రోగులకూ ఆరోగ్య బీమా.
- డిశ్చార్జి అభ్యర్థన వస్తే మూడు గంటల్లోగా బీమా సంస్థలు తుది అనుమతి ఇవ్వాలి.
- ఆయుర్వేద, యోగా, నాచురోపతి, సిద్ధ, యునానీ, హోమియోపతికీ బీమా.
- ముందున్న షుగర్, బీపీ వంటి అనారోగ్య సమస్యలకు ఇన్సూరెన్స్ కవరేజీ ఉండాలంటే పాలసీ కొన్న నాలుగేండ్ల తర్వాతే వీలుపడేది. అయితే దీన్ని మూడేండ్లకు తగ్గించారు. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ వంటి స్పెసిఫిక్ డీసీజ్లు/ప్రొసీజర్ల వెయిటింగ్ పీరియడ్ కూడా మూడేండ్లే.
- మీరు పాలసీ తీసుకున్న బీమా సంస్థతో లింకైన దవాఖానలేగాక ఇతర దవాఖానల్లో చికిత్స తీసుకున్నా క్యాష్‌లెస్ వైద్య సదుపాయం.
- ఆరోగ్య బీమాలో మారటోరియం వ్యవధిని 8 ఏండ్ల నుంచి 5 ఏండ్లకు తగ్గింపు. రెగ్యులర్ పాలసీదారుల క్లెయిమ్‌ల తిరస్కరణ తగ్గనున్నది.
- మీకు ఒకటి కన్నా ఎక్కువ పాలసీలుంటే.. చికిత్స ఖర్చును క్లెయిమ్ చేసుకోవడానికి వాటన్నిటినీ ఒకేసారి వినియోగించుకోవచ్చు.
- ఇండెమ్నిటీ ఆధారిత పాలసీలు వద్దన్న ఐఆర్డీఏఐ.. బెనిఫిట్ ఆధారిత పాలసీలనే ఇవ్వాలని ఇన్సూరెన్స్ కంపెనీలకు స్పష్టం చేసింది. దీనివల్ల పాలసీదారులకు నిర్ధిష్ట దవాఖాన ఖర్చులు అందుతాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

