HDFC Bank | జూన్ త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు నికర లాభం 35 శాతం వృద్ధి..!
HDFC Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం నికర లాభాల్లో 35.33 శాతం వృద్ధి సాధించింది.
HDFC Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం నికర లాభాల్లో 35.33 శాతం వృద్ధి సాధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.11,951.77 కోట్ల నికర లాభం గడించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఏడాది రూ.16,174.75 కోట్లకు పెంచుకున్నది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పోలిస్తే 2024-25 జూన్ త్రైమాసికం నికర లాభం 2.04 శాతం తక్కువ. 2023-24 మార్చి త్రైమాసికంలో రూ.16,511.85 కోట్ల నికర లాభం సంపాదించింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్.
బ్యాంకు మొత్తం ఆదాయం 44.77 శాతం పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ.57,816.67 కోట్ల ఆదాయం సముపార్జించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆదాయం ఈ ఏడాది రూ.83,701.25 కోట్లకు దూసుకెళ్లింది. గతేడాది మార్చి త్రైమాసికంతో పోలిస్తే 6.62 శాతం ఆదాయం పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో వడ్డీ ఆదాయం 50.31 శాతం పెంచుకుని రూ.73,033.14 కోట్లకు చేరుకున్నది. మార్చి త్రైమాసికం వడ్డీ ఆదాయంతో పోలిస్తే 2.18 శాతం ఎక్కువ. బ్యాంకు స్థూల మొండి బకాయిలు జూన్ త్రైమాసికంలో 1.33 శాతానికి పెరిగాయి. గత మార్చి త్రైమాసికంలో 1.17 శాతం మాత్రమే. నికర మొండి బకాయిలు 0.3 నుంచి 0.39 శాతానికి చేరాయి.
ఇవి కూడా చదవండి:
Amazon Prime Day 2024 Sale-iPhone 13 | రూ.50 వేలలోపు ధరకే ఐఫోన్ 13.. ఇవీ డిటెయిల్స్..’
Hyundai Venue | వెన్యూ.. ఎక్స్టర్లపై హ్యుండాయ్ డిస్కౌంట్లు.. గరిష్టంగా రూ.55 వేలు..!
Suzuki Motor Cycles | ఫెస్టివ్ కలర్స్ తో సుజుకి యాక్సెస్.. బర్గ్‌మన్ స్ట్రీట్ స్కూటర్లు.. ధరలిలా..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

