హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 8,434 కోట్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: హెచ్డీఎఫ్సీ ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 15.8 శాతం పెరిగి రూ.8,434 కోట్లుగా నమోదైంది. గతేడాది రూ.7,280 కోట్ల లాభాన్ని గడించింది. కన్సాలిడేటెడ్ అడ్వాన్స్‌లు ఏడాది ప్రాతిపదికన 13.6 శాతం పెరిగి రూ.10,43,671 కోట్ల నుంచి రూ.11,85,284 కోట్లకు చేరుకున్నట్లు బ్యాంక్ తెలిపింది. జనవరి-మార్చి మధ్యకాలానికిగాను బ్యాంక్ రూ.40,909.49 కోట్ల ఆదాయాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.38,287.17 కోట్లుగా ఉన్నది. గతేడాది మొత్తానికి రూ. 1,55, 885.28 కోట్ల ఆదాయంపై రూ.31,833 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.26 శాతం నుంచి 1.32 శాతానికి పెరిగినట్లు తెలిపింది. విలువ పరంగా చూస్తే రూ.12,649.97 కోట్ల నుంచి రూ.15,086 కోట్లకు చేరుకున్నాయి. నికర నిరర్థక ఆస్తుల విలువ కూడా 0.36 శాతం(రూ.3,542.36 కో ట్ల) నుంచి 0.40 శాతానికి(రూ.4,554. 82 కోట్ల) పెరిగాయి. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి గత త్రైమాసికంలో బ్యాంక్ రూ.4,693.70 కోట్ల నిధులను వెచ్చించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- hdfc
- hdfc bank
- Q4 net profit
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

