HDFC Credit Card | క్రెడిట్ కార్డుతో రెంట్ చెల్లింపుపై ఫీజు.. ఇతర లావాదేవీలకూ లిమిట్ పెట్టిన హెచ్డీఎఫ్సీ
HDFC Bank Credit Card | హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన క్రెడిట్ కార్డులతో రెంట్ చెల్లింపులపై ఒకశాతం ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. అలాగే ఫ్యుయల్ వినియోగం, యుటిలిటీ లావాదేవీలకూ పరిమితి విధించింది. ఈ మార్పులు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
HDFC Bank Credit Card | గతంతో పోలిస్తే ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం పెరిగింది. క్రెడిట్ కార్డుల వాడకంతో క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉంటాయి. దేశీయంగా క్రెడిట్ కార్డుల జారీలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు మొదటి స్థానంలో నిలిచింది. అయితే బ్యాంకులన్నీ తమ క్రెడిట్ కార్డు బెనిఫిట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, పేమెంట్స్ విధానంలో పలు మార్పులు తెస్తున్నట్లు ప్రకటించాయి. ఆ జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా చేరింది. క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె చెల్లిస్తే చార్జీ విధించాలని నిర్ణయించినట్లు తన క్రెడిట్ కార్డు యూజర్లకు ఈ-మెయిల్ ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంకు తెలిపింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి మార్పులు అమల్లోకి రానున్నాయి.
తన బ్యాంకు క్రెడిట్ కార్డుతో క్రెడ్, పేటీఎం, చెక్, మొబిక్విక్, ఫ్రీ చార్జీతోపాటు ఇతర ప్లా్ట్ ఫామ్స్ ద్వారా రెంట్ చెల్లింపులపై ఒకశాతం చార్జీ వసూలు చేయాలని నిర్ణయించినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు తెలిపింది. గరిష్టంగా రూ.3,000 వరకూ ఇంటి అద్దె చెల్లింపు ఫీజు వసూలు చేస్తామని పేర్కొంది. తక్షణం ఈ నిబంధన అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది.
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంకు వంటి క్రెడిట్ కార్డు మినహా అన్ని క్రెడిట్ కార్డుల ద్వారా రెంట్ చెల్లింపు, ఈ-వాలెట్ లోడింగ్ లావాదేవీలను గత ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఐసీఐసీఐ బ్యాంకు తొలగించింది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కూడా తన అరుమ్ (AURUM), ఎస్బీఐ కార్డ్ ఎలైట్, సింప్లీ క్లిక్ వంటి ఎస్బీఐ కార్డుల వాడకం దారులు రెంట్ చెల్లిస్తే వచ్చే రివార్డు పాయింట్లు నిలిపేసింది.
రెంట్ పేమెంట్‌తోపాటు ఫ్యుయల్ వినియోగం, యుటిలిటీ లావాదేవీల చెల్లింపులకూ పరిమితులు విధించింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. కన్జూమర్ కార్డులతో ఫ్యుయల్ బిల్లు రూ.15 వేలు దాటినా ఒక శాతం చార్జీ చెల్లించాలి. బిజినెస్ కార్డులపై గరిష్టంగా రూ.30 వేల పరిమితి విధించింది. ఈ పరిమితి దాటితే ఒక శాతం చొప్పున రూ.3000 ఫీజు చెల్లించాలి.
ఇక కన్జూమర్ కార్డులతో యుటిలిటీ లావాదేవీలు జరిపేందుకు గరిష్టంగా రూ. 50 వేలు, బిజినెస్ కార్డులపై రూ.75 వేల పరిమితులు విధించింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. ఆ పరిమితి దాటినా ఒకశాతం ఫీజు.. గరిష్టంగా రూ.3000 వరకూ ఫీజు పే చేయాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

