Belated ITR | ఐటీఆర్ ఫైలింగ్ కు మరో చాన్స్.. అయితే రూ.5000 పెనాల్టీ పే చేయాల్సిందే..!
Belated ITR | గత జూలై 31 లోపు 2022-23 ఆర్థిక సంవత్సర ఐటీఆర్ ఫైల్ చేయని వారికి ఆదాయం పన్ను విభాగం మరో అవకాశం ఇస్తోంది. ఈ నెలాఖరులోగా పెనాల్టీతో బీలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు.
Belated ITR | మీరు వేతన జీవులా.. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఐటీ రిటర్న్స్ ఇంకా దాఖలు చేయలేదా.. ఇప్పటికీ ఐటీఆర్ దాఖలు చేయడానికి మరో అవకాశం కల్పిస్తోంది ఆదాయం పన్ను విభాగం. ఈ నెలాఖరులోగా ‘బీ లేటెడ్ ఐటీఆర్’ సమర్పించవచ్చునని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గత జూలై 31 తుది గడువు. ఆ గడువు ముగిసిన తర్వాత బీ లేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. కానీ ఇప్పటికీ ఐటీఆర్స్ ఫైల్ చేయని వారు గణనీయ సంఖ్యలోనే ఉన్నారని ఆదాయం పన్ను విభాగం తెలిపింది. కనుక వారంటా ఈ నెల 31 లోపు బీలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేయాలని హితవు చెప్పింది.
జూలై 31 లోపు ఐటీఆర్ దాఖలు చేసిన వారు.. తమ ఐటీఆర్ ఫైలింగ్‌లో ఏమైనా తప్పులు దొర్లినా ‘బీలేటెడ్ ఐటీఆర్’ ఫైల్ చేయొచ్చు. తప్పులు సరిదిద్దుకోకుంటే భవిష్యత్‌లో వారికి ఐటీ విభాగం నోటీసు జారీ చేసే అవకాశాలు ఉంటాయి. రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఎటువంటి ఆలస్య ఫీజు పే చేయనవసరం లేదు.
బీలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేసే వారు మాత్రం సాధారణ రిటర్న్స్ ఫైల్ చేయాలి. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫై చేసిన ఫామ్‌తోనే ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే బీలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేస్తున్న వారు తమ ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉంటే రూ.1000 పెనాల్టీ.. అంత కంటే ఎక్కువ ఆదాయం గల వారు రూ.5000 వరకు పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. ఆదాయం పన్ను చెల్లింపు పెండింగ్ లో ఉంటే.. అంత మొత్తంపై ఒకశాతం వడ్డీ కూడా చెల్లించాలి. అయితే, బీలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేసిన వారు తర్వాత 30 రోజుల్లో దాన్ని వెరిఫై చేసుకోవడం మరిచిపోవద్దని ఆదాయం పన్ను విభాగం హితవు చెప్పింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

