న్యూఢిల్లీ, మార్చి 22: మార్కెట్లోకి సోమవారం హావెల్స్ గాలిని శుద్ధి చేసే ఫ్యాన్‌ను విడుదల చేసింది. స్టెల్త్ ప్యూరో ఎయిర్ పేరుతో విడుదల చేసిన ఈ ఫ్యాన్ ధరను రూ.15 వేలుగా నిర్ణయించింది. దీంతోపాటు కార్బన్ ఫిల్టర్స్ కలిగిన వ్యక్తిగత లైఫ్‌ైస్టెల్ ఫ్యాన్‌ను కూడా ఆవిష్కరించింది. మూడు గంటల బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఈ ఫ్యాన్‌ను యూఎస్బీ కేబుల్ లేదా మొబైల్ చార్జర్‌తో చార్జింగ్ చేసుకోవచ్చును. ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కోరుకునే వారి కోసం ఈ ఫ్యాన్‌ని తయారు చేసినట్లు కంపెనీ ఇండియా ప్రెసిడెంట్ ఆర్ఎస్ నేగి తెలిపారు.