Havells | న్యూఢిల్లీ, జూలై 20: ఎలక్ట్రికల్స్ వస్తువులు, గృహోపకరణాల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన హావెల్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 18 శాతం ఎగబాకి రూ.287 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. కన్జ్యూమర్ డిమాండ్ లేకపోయినప్పటికీ లాభాల్లో వృద్ధి నమోదైందని కంపెనీ సీఎండీ అనిల్ రాయ్ గుప్తా తెలిపారు. ఏడాది క్రితం రూ.243 కోట్ల లాభాన్ని గడించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.4,292 కోట్ల నుంచి రూ.4,899 కోట్లకు ఎగబాకినట్లు వెల్లడించింది. స్విచ్‌గేర్ వ్యాపారం 5 శాతం వృద్ధిని కనబరుచగా, కేబుల్ బిజినెస్ 24 శాతం, ఎలక్ట్రికల్ డ్యూరబుల్ 5 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేసుకున్నట్లు ఆయన చెప్పారు.