GST Collection | భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు..! ఆ కాలంలో ఏకంగా రూ.14.79లక్షల కోట్లకు..!
GST Collection | గతేడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో స్థూల జీఎస్టీ వసూళ్లు 12శాతం పెరిగాయి. జీఎస్టీ వసూళ్లు రూ.14.97లక్షల కోట్లకు చేరాయి. 2022లో ఇదే సమయంలో (ఏప్రిల్-డిసెంబర్) జీఎస్టీ రూ.13.40లక్షల కోట్లు వసూలయ్యాయి.
GST Collection | గతేడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో స్థూల జీఎస్టీ వసూళ్లు 12శాతం పెరిగాయి. జీఎస్టీ వసూళ్లు రూ.14.97లక్షల కోట్లకు చేరాయి. 2022లో ఇదే సమయంలో (ఏప్రిల్-డిసెంబర్) జీఎస్టీ రూ.13.40లక్షల కోట్లు వసూలయ్యాయి. కేంద్ర ఆర్థిక ఈ విషయాన్ని వెల్లడించింది. జీఎస్టీ వార్షిక ఆదాయం పెరుగుతూ వస్తున్నది. అయితే, డిసెంబర్లో మూడు నెలల కనిష్ఠానికి పడిపోయింది. డిసెంబర్లో దేశ జీఎస్టీ వసూళ్లు 10.28 శాతం పెరిగి రూ.1.65 లక్షల కోట్లకు చేరుకున్నాయి. డిసెంబర్ 2022లో వస్తువులు సేవల పన్ను వసూళ్లు దాదాపు రూ.1.50 లక్షల కోట్లు.
అయితే, డిసెంబర్ 2023 వసూళ్లు నవంబర్లో రూ.1.68 లక్షల కోట్లు, అక్టోబర్లో రూ.1.72 లక్షలు వసూలయ్యాయి. ‘ఈ నెలలో దేశీయ లావాదేవీల (సేవల దిగుమతులతో సహా) ఆదాయం గత ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయం కంటే 13శాతం ఎక్కువని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్-2023లో స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,64,882కోట్లు. ఇందులో సీజీఎస్టీ రూ.30,443కోట్లు. ఎస్జీఎస్టీ రూ.37,935 కోట్లు కాగా.. ఐజీఎస్టీ రూ.84,255 కోట్లు (వస్తువుల దిగుమతులపై సేకరించినది రూ. 41,534 కోట్లు కలిపి) వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏడో నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షలకోట్లకు పైగా నమోదయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

