Edible Oils | వంట నూనెలపై సుంకాల తగ్గింపు.. అందుకేనా?!
Edible Oils | వంట నూనెలపై దిగుమతి సుంకాలను కేంద్రం తగ్గించింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలే కారణమా? అన్న సందేహాలున్నాయి.

వినియోగదారుల పట్ల కేంద్రం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నదా.. అంటే అవుననే సమాధానమే వస్తున్నది. దేశీయ అవసరాల నిమిత్తం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తూ కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ కార్యదర్శి శనివారం ఆదేశాలు జారీ చేశారు. అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు తగ్గనున్నాయి. అయితే, నెల రోజుల్లోపు దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలపై సుంకాలు తగ్గించడం ఇది రెండో సారి కావడం గమనార్హం.
నెలలో రెండోసారి సుంకాల తగ్గింపు
ఖరీఫ్ సీజన్లో పంటల దిగుబడి బాగానే ఉంటుందన్న అంచనాలతోపాటు అంతర్జాతీయంగా తగ్గిన ధరలు దీనికి కారణమని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఇంతకుముందు దిగుమతి సుంకాల తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఈ నెలాఖరుతో ముగిసిపోనున్నది. ఈ నేపథ్యంలోనే మరోమారు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది.
అన్ని పన్నులు కలిసి ఇలా..
కేంద్రం నిర్ణయం ప్రకారం అన్ని రకాల ముడి వంట నూనెల దిగుమతిపై కస్టమ్స్ సుంకం, అదనపు ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ సెస్ 24.75 శాతంగా ఉంటుంది. రిఫైండ్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకం 35.75 శాతం ఉంటుంది. ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం 10% నుంచి 2.5 శాతానికి, ముడి సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ఉన్న 7.5% సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించింది. 60 దేశాల నుంచి కేంద్రం వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నది.
ఇవీ కారణాలు..
ఇంతకుముందు పప్పు ధాన్యాలపై దిగుమతి సుంకాలు తగ్గించిన కేంద్రం.. ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లే వంట నూనెల ధరలను తగ్గించి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయ తలపెట్టింది. ట్రేడర్లు, హోల్‌సేల్ వ్యాపారులు తమ వద్ద ఉన్న వివిధ రకాల నూనెల నిల్వల వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రం వంట నూనెల దిగుమతిపై సుంకాలు తగ్గించడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
World Trade Center : ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి
IT Returns | బిగ్ రిలీఫ్.. ఐటీ రిటర్న్స్ గడువు పొడిగించిన కేంద్రం
RBI rule on ATM | గ్రామీణులకు షాక్.. ఏటీఎంలు ఎత్తేస్తున్న బ్యాంకులు?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- edible oils
- import duty
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

